విశ్వంభర vs వీరమల్లు.. అయ్యే పనేనా?
అయితే అదే డేట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక సినిమా రాబోతున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 15 Feb 2024 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి నుంచి నెక్స్ట్ రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంచి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డేట్ విషయంలో మాత్రం మార్పులు జరిగే అవకాశాలు లేదని చెబుతున్నారు.
అయితే అదే సమయానికి మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున మరో బంగార్రాజు క్యారెక్టర్ తో ఆ సంక్రాంతిని టార్గెట్ చేశాడు. మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి తో అదే ఫెస్టివల్ కు రాబోతున్నాడు. ఏ ఈ కాంబినేషన్లో రాబోతున్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాబట్టి సంక్రాంతి పోటీ వచ్చే ఏడాది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.
అయితే అదే డేట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక సినిమా రాబోతున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ప్రొడక్షన్లో రాబోతున్న ఈ ప్రాజెక్టు పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితులు అలాగే ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు జరగడం వలన షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది.
రీసెంట్ గా దర్శకుడు క్రిష్ కూడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు చాలా రకాల కథనాలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కూడా ఫినిష్ చేసే అవకాశం ఉంది. ఇక నిర్మాత ప్లాన్ ప్రకారం అయితే 2025 సంక్రాంతికి ఈ సినిమాలో విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారట.
అయితే అప్పుడు మెగాస్టార్ విశ్వంభర కూడా ఉంది కాబట్టి ఈ క్లాష్ అసలు ఏ మాత్రం మంచిది కాదు. తప్పకుండా ఆ సినిమాకు పోటీగా అయితే పవన్ కళ్యాణ్ రాడు అని చెప్పవచ్చు. అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నిర్మాతల నిర్ణయాలను బట్టి ఉంటుంది. మరి ఈ క్లాష్ నిజంగానే చోటు చేసుకుంటుందా లేదంటే వీరమల్లు వెనుకడుగు వేస్తాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి.