Begin typing your search above and press return to search.

మొన్న బాలయ్యతో.. నేడు తారక్ తో.. విశ్వక్, సిద్ధు బిజీబిజీ!

టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ.. తమకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2024 12:15 PM GMT
మొన్న బాలయ్యతో.. నేడు తారక్ తో.. విశ్వక్, సిద్ధు బిజీబిజీ!
X

టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ.. తమకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివిధ క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నారు. షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. చివరగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విశ్వక్ సేన్.. టిల్లు స్క్వేర్ తో సిద్ధు.. సినీ ప్రియుల ముందుకు వచ్చి మంచి హిట్స్ ను అందుకున్నారు.

అయితే రీసెంట్ గా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి కనిపించిన వారిద్దరూ.. ఇప్పుడు తారక్ తో సందడి చేశారు. ఏపీలో ఇటీవల వరదలు సృష్టించిన బీభత్సం పట్ల తమ వంతు సహాయంగా ప్రకటించిన విరాళాలను అందించేందుకు బాలయ్యతో కలిసి విజయవాడ వెళ్లారు. చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు అందించారు. అనంతరం హైదరాబాద్ వచ్చేసిన వీరు.. ఇప్పుడు తారక్ ను ఇంటర్వ్యూ చేశారు.

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1.. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వివిధ ఇంటర్వ్యూలు, షోలకు అటెండ్ అవుతూ అందరి దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకుంటున్నారు.

అందులో భాగంగా తారక్, కొరటాలను విశ్వక్, సిద్ధు ఇంటర్వ్యూ చేశారు. ఇంకా ఫుల్ వీడియో రిలీజ్ కాకపోయినప్పటికీ.. ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అయితే విశ్వక్, సిద్ధు ఇద్దరూ తారక్ ఫ్యాన్సే. ఎప్పటికప్పుడూ వీరు ముగ్గురు కలుస్తుంటారు. గతంలో వారిద్దరి చిత్రాల ఈవెంట్స్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఇప్పుడు విశ్వక్, సిద్ధు.. తారక్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ చేశారు.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటర్వ్యూపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెయిటింగ్ ఫర్ ఇంటర్వ్యూ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ గా కచ్చితంగా ఉండనుందని చెబుతున్నారు. ఫన్ కూడా అంతే రీతిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ క్రేజీ ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ అవుతుందో? ఎలా అలరిస్తుందో? ఎంతటి బజ్ క్రియేట్ చేస్తుందో? వేచి చూడాలి.