Begin typing your search above and press return to search.

GOGలో లంకల రత్నగా విశ్వక్.. గెట్ రెడీ ఫ్యాన్స్!

ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న తెలుగు హీరోయిన్ అంజలి ఇటీవల షూటింగ్ అప్డేట్ ఇవ్వగా.. తాజాగా విశ్వక్ సేన్ క్రేజీ వీడియో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   15 April 2024 4:23 AM GMT
GOGలో లంకల రత్నగా విశ్వక్.. గెట్ రెడీ ఫ్యాన్స్!
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రయోగాత్మక మూవీ గామితో మంచి హిట్ కొట్టిన విశ్వక్.. త్వరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సందడి చేయనున్నారు. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తవ్వగా.. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.


ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న తెలుగు హీరోయిన్ అంజలి ఇటీవల షూటింగ్ అప్డేట్ ఇవ్వగా.. తాజాగా విశ్వక్ సేన్ క్రేజీ వీడియో షేర్ చేశారు. తన మీసం, గడ్డాన్ని ట్రిమ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో తన రోల్ కు బై బై చెప్పేశారు. మే 17 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇన్ థియేటర్స్ అని రిలీజ్ డేట్ ను మరోసారి మాస్ కా దాస్ గుర్తు చేశారు.

ఈ సినిమాలో కోనసీమ కుర్రాడిగా కనిపించనున్న విశ్వక్ సేన్.. లంకల రత్న పాత్రలో సందడి చేయనున్నారు. అయితే ఈ మూవీకి టైటిల్ గా లంకల రత్న ఫిక్స్ చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. త్వరలోనే మేకర్స్.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అందాల భామ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారిన ఓ వ్యక్తి ప్రయాణమే ఈ చిత్రం స్టోరీ లైన్ గా తెలుస్తోంది. ప్రేక్షకులకు ఈ మూవీ మరపురాని అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ మూవీకి వెంకట్ ఉప్పుటూరి, గోపి చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.