విశ్వంభర - ఓవర్సీస్ రేటు గట్టిగానే..
బింబిసార తర్వాత అంతకుమించి అనేలా విశ్వంభర మూవీని వశిష్ఠ మల్లిడి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం
By: Tupaki Desk | 28 Jan 2024 4:55 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో మొదలైన మూవీ విశ్వంభర. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో డిఫరెంట్ కథాంశంతో చేస్తోన్న మూవీ కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. మైథాలజీ బేస్ చేసుకొనినడిచే సోషియో ఫాంటసీ కథతో వశిష్ఠ మల్లిడి ఈ మూవీ చేస్తున్నాడు.
బింబిసార తర్వాత అంతకుమించి అనేలా విశ్వంభర మూవీని వశిష్ఠ మల్లిడి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాతో తన ఇమేజ్ కూడా మారుతుందని మెగాస్టార్ చిరంజీవిబలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే మూవీ ప్రారంభం అయ్యి ఇంకా సగం కూడా కంప్లీట్ కాకుండానే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడైపోయాయి.
ఇది మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి అద్దం పడుతుందది. ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ని సరిగమ వారు 16 కోట్లకి కొనుగోలు చేశారు. చిరంజీవి కెరియర్ లోనే హైయెస్ట్ ఓవర్సీస్ రైట్స్ ఇవే కావడం విశేషం. లార్జ్ స్కేల్ మీద సినిమా తెరకెక్కుతూ ఉండటంతో పాటు మెగాస్టార్ ఇమేజ్, ఛరిష్మా కారణంగా ఈ స్థాయిలో రైట్స్ అమ్ముడైపోయినట్లు తేలుస్తోంది. ఇక ఈ మూవీ నైజాం హక్కుల కోసం దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మధ్యలో పోటీ ఉంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో యూవీ టీం ఉంది. అయితే అదే సమయంలో దిల్ రాజు నిర్మిస్తోన్న శతమానం భవతి నెక్స్ట్ పేజీ మూవీని కూడా రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. క్యాస్టింగ్ అండ్ క్రూ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది రిలీజ్ అయితే నైజాం హక్కులు దిల్ రాజు తీసుకోకపోవచ్చు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. చిత్ర ప్రముఖులు అందరూ మెగాస్టార్ ని ప్రత్యేకంగా కలిసి విషెస్ చేస్తున్నారు. ఇలాంటి సంతోషకర సమయంలో విశ్వంభర రైట్స్ కూడా రికార్డ్ ధరకి అమ్ముడుకావడం నిజంగా విశేషమని చెప్పాలి.