Begin typing your search above and press return to search.

క‌మెడియ‌న్ విశ్వేశ్వ‌ర‌రావు క‌న్నుమూత‌

విశ్వేశ్వరరావు ఏపీలోని కాకినాడ‌లో జ‌న్మించారు. బాల న‌టుడిగానే కెరీర్ ప్రారంభించారు. హాస్యనటుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు

By:  Tupaki Desk   |   2 April 2024 12:39 PM GMT
క‌మెడియ‌న్ విశ్వేశ్వ‌ర‌రావు క‌న్నుమూత‌
X

ప్ర‌ముఖ‌హాస్య న‌టుడు విశ్వేశ్వ‌రావు(62) మంగ‌ళ‌వారం చెన్నైలో క‌న్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయన క‌న్నుమూసిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. దీంతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. విశ్వేశ్వర రావు మృతి పట్ల తమిళ..తెలుగు ప‌రిశ్ర‌మ‌లు దిగ్బ్రాంతి వ్యక్తం చేసాయి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని స‌తాపం ప్ర‌క‌టించారు. తెలుగు..త‌మిళ భాష‌ల్లో విశ్వేశ్వ‌ర‌రావు అనేక చిత్రాల్లో న‌టించారు.

విశ్వేశ్వరరావు ఏపీలోని కాకినాడ‌లో జ‌న్మించారు. బాల న‌టుడిగానే కెరీర్ ప్రారంభించారు. హాస్యనటుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. బాల న‌టుడిగానే 150కి పైగా సినిమాలు చేసారు. కెరీర్ మొత్తంలో 350కి పైగా చిత్రాల్లో న‌టించారు. టీవీ సీరియ‌ళ్ల‌లో కూడా న‌టించారు. ఓ సీరియ‌ల్ లో పిత్త‌ప‌రిగి అనే పాత్ర‌తో బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన న‌టుడు. విశ్వేశ్వర రావు సీనియర్‌ ఎన్టీఆర్‌.. ఎంజీఆర్‌.. చిరంజీవి.. రజినీకాంత్‌.. నాగార్జున.. పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి నటించారు.

'ఆమె కథ'.. 'ముఠా మేస్త్రీ'.. 'బిగ్‌బాస్‌'.. 'ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం'.. 'ఆయనకు ఇద్దరు'.. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'.. 'మెకానిక్‌ అల్లుడు'.. 'శివపుత్రుడు'.. 'శివాజీ' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో న‌టించారు.

ఆ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులకు మ‌రింత దగ్గరయ్యారు. విశ్వేశ్వర రావు నిర్మాత.. దర్యకుడిగా కూడా ప‌నిచేసారు.

ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. విస్సు టాకీస్ పేరుతో తమిళ్ లో ఈ యూట్యూబ్ ఛానల్ కొనసాగిస్తున్నారు. ఈ ఛాన‌ల్ లో సినిమాల‌కు సంబంధించిన విశేషాలు పంచుకునేవారు. ముగ్గురు ముఖ్య మంత్రులు ఎన్టీఆర్‌.. ఎంజీఆర్‌.. జయలలితతో తాను పనిచేసినట్లు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు.

విశ్వేశ్వర రావు మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని నివాసంలో ప్రేక్ష‌కాభిమానుల సందర్శనార్థం ఉంచారు.