Begin typing your search above and press return to search.

బ్యూటిఫుల్ లొకేషన్ లో వితిక ఐకానిక్ పోజ్

వితిక షేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి నటిగా పరిచయమైనా హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   9 July 2024 11:28 AM GMT
బ్యూటిఫుల్ లొకేషన్ లో వితిక ఐకానిక్ పోజ్
X

వితిక షేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి నటిగా పరిచయమైనా హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ప్రేమించు రోజుల్లో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వితిక.. కెరీర్ లో మెల్లమెల్లగా ఎదుగుతున్న సమయంలో హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయి.. సినిమాలకు పూర్తిగా దూరమైంది. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో మాత్రం పాల్గొంది వితిక.

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది వితిక. భర్తతో కలిసి హౌస్ కు వెళ్లిన ఆమె.. సినిమాల్లో పెద్దగా ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోయినా బిగ్ బాస్ తో మాత్రం బాగా ఫేమస్ అయింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది వితిక. యూట్యూబ్ లో వీలాగ్స్ తో ట్రెండింగ్ లో ఉంటోంది. వివిధ బుల్లితెర షోల్లో కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది.

ఇక ఇన్ స్టాగ్రామ్ లో వితిక.. డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటోంది. రకరకాల ఫోటోస్ పోస్ట్ చేస్తోంది. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ షేర్ చేసి సందడి చేస్తుంటోంది. తన చెల్లెలితో రీల్స్ చేస్తూ అలరిస్తుంటోంది. ఫ్యాషన్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తుంటోంది. ఆ మధ్య వేరే లెవల్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోస్ ను షేర్ చేసింది. సిక్స్ ప్యాక్ తెచ్చుకొని తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఫుల్ వైరల్ అయింది. వితిక హెవీ వర్కౌట్స్ కు నెటిజన్లు అంతా షాక్ అయిపోయారు.

ఎప్పటికప్పుడు వెకేషన్లకు వెళ్తుంటోంది వితిక. ఆ మధ్య గోవా, థాయ్ లాండ్ లో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. ఇప్పుడు మళ్లీ వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది వితిక. ట్రైన్ జర్నీకి సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. అందమైన లొకేషన్ లో ట్రైన్ డోర్ వద్ద నిల్చుని ఫోటోస్ దిగింది. పింక్ కలర్ టాప్, వైట్ కలర్ ఫ్లోరల్ మిడ్డీ వేసుకుని వితిక ఇచ్చిన ఐకానిక్ పోజ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం వితిక ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే పిక్స్ తోపాటు అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది వితిక. కొన్ని ప్రయాణాలు మీ గమ్యం గురించి అద్భుతంగా బోధిస్తాయంటూ రాసుకొచ్చింది. తన డ్రీమ్ ట్రైన్ జర్నీ సాధ్యం చేసినందుకు ఓ ట్రావెల్ ఏజెన్సీకి థ్యాంక్స్ చెప్పింది. అయితే వితిక ఫోటోలు సూపర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్ లొకేషన్ లో వెరీ బ్యూటిఫుల్ వితిక అంటూ కొనియాడుతున్నారు. మరి వితిక పిక్స్ ను మీరు చూశారా లేదా?