Begin typing your search above and press return to search.

ఇండియా-పాక్ విభ‌జ‌న‌పై సిరీస్.. చ‌రిత్ర‌ను వ‌క్రించారా?

అత‌డు చరిత్రను వ‌క్రీక‌రించాడ‌ని ఆయ‌న తీవ్రంగా విమర్శించారు.

By:  Tupaki Desk   |   10 Nov 2024 6:10 AM GMT
ఇండియా-పాక్ విభ‌జ‌న‌పై సిరీస్.. చ‌రిత్ర‌ను వ‌క్రించారా?
X

నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించిన `ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్` సోనీ లివ్‌లో నవంబర్ 15న ప్రీమియర్ కానుంది. సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, మలిష్కా మెండోన్సా, ఇరా దూబే తదితరులు ఈ సిరీస్ తారాగ‌ణం. 1947 నాటి భారతదేశం-పాకిస్తాన్ విభజనకు సంబంధించిన సంఘటనలను విశ్లేషించే ఈ సిరీస్ రిలీజ్ ముందే వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. సిరీస్ విడుదలకు ముందు ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్, క‌శ్మీర్ ఫైల్స్ ఫేం వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌కుడు అద్వాణీపై విరుచుకుప‌డ్డారు. అత‌డు చరిత్రను వ‌క్రీక‌రించాడ‌ని ఆయ‌న తీవ్రంగా విమర్శించారు.

తన సిరీస్ గురించి నిఖిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను షేర్ చేస్తూ... నాటి అల్లర్లకు మతపరమైన రంగును పుల‌మ‌లేద‌ని నిక్కిల్ అద్వానీ పేర్కొన్నారని వివేక్ అగ్నిహోత్రి ఎత్తి చూపారు. త‌న ఎక్స్ ఖాతాలో దీనిని విమ‌ర్శిస్తూ...``ప్రియమైన నిఖిల్, కొన్ని బంతులు వేయండి. మీరు భారతదేశ విభజన హింసాత్మక, మతపరమైన చరిత్రను తెర‌పై చూపించ‌న‌ట్లయితే.. కనీసం బంతుల్లో నేరస్థుడు ఎవరు? అనేది క‌నీసం చూపించండి`` అని వ్యాఖ్యానించారు.

మొదట మీరు చూడాల్సిన‌ది.. అవి కేవలం అల్లర్లు కాదు.. హిందూ మారణహోమం.. దానికి మతపరమైన రంగు ఉంది. అది ఆకుపచ్చ... రెండవది.. హింస కేవలం మతం పేరుతో న‌డిపించిన‌ది. ఆ మతం పేరు ఇస్లాం. హిందువులు ఎప్పుడూ ముస్లింలను భారతదేశం విడిచి వెళ్లాలని కోరరు. ``మీరు ఎందుకు వైట్‌వాష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? లేదా వోక్స్ చెప్పినట్లు మ‌న దేశ‌ చరిత్రను గ్యాస్‌లైట్ చేయండి.. ధ‌ర్మం కోసం ఎవరు నిలబడతారో ఎవరికీ తెలియదా?`` అని సాటి ద‌ర్శ‌కుడు నిఖిల్ అద్వాణీని తప్పు ప‌డుతూ ప్ర‌శ్నించారు.

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ డొమినిక్ లాపియర్ & లారీ కాలిన్స్ రాసిన పుస్త‌కం ఆధారంగా అదే పేరుతో సినిమా రూపొందింది. వివేక్ అగ్నిహోత్రి విమర్శలపై నిఖిల్ అద్వానీ ఇంకా స్పందించలేదు.