Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ కాంబో సీట్లలో కూర్చోనివ్వకుండా చేస్తారట..!

కొన్ని కాంబినేషన్స్ కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ కు భలే థ్రిల్ అనిపిస్తుంది. అందులోనూ సూపర్ హిట్ కాంబినేషన్ ఐతే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 2:26 PM GMT
హ్యాట్రిక్ కాంబో సీట్లలో కూర్చోనివ్వకుండా చేస్తారట..!
X

కొన్ని కాంబినేషన్స్ కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ కు భలే థ్రిల్ అనిపిస్తుంది. అందులోనూ సూపర్ హిట్ కాంబినేషన్ ఐతే ఆ లెక్క వేరేలా ఉంటుంది. హీరో డైరెక్టర్ కాంబోలో ఫలానా హీరో ఫలానా డైరెక్టర్ అని మన దగ్గర చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఐతే వీటిలో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ కూడా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. నానితో ముందు అంటే సుందరానికీ సినిమా చేసిన వివేక్ ఆత్రేయ ఆ సినిమా తో లెక్క సరిపోలేదని సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని తన సత్తా చాటారు.

ఐతే సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ లో నాని ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు ఇచ్చాడు. సినిమాకు తను చాలా కష్టపడ్డాడని అన్నారు. ఈ సినిమా నా కోసం కాకపోయినా వివేక్ కోసం బాగా ఆడాలని కోరుకున్నానని అన్నారు. మా కాంబినేషన్ లో మొదటి సినిమా అంటే సుందరానికీ వచ్చింది. రెండో సినిమా సరిపోదా శనివారం మంచి మాస్ సినిమా ఇచ్చాం థర్డ్ సినిమా చేస్తే ఈసారి కుర్చీలో ఎవరు కూర్చోలేనంత ఫన్ సినిమా చేస్తామని అన్నారు.

వివేక్ అలాంటి కథతో వస్తే తనతో మూడో సినిమా కూడా చేస్తానని అన్నారు నాని. సో వివేక్ నాని ఈ కాంబో హ్యాట్రిక్ సినిమా కూడా దాదాపు ఓకే అయినట్టే లెక్క. దసరా, హాయ్ నాన్న లేటెస్ట్ గా సరిపోదా శనివారం ఇలా వరుస సూపర్ హిట్ సినిమాలతో నాని తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మరోసారి యాక్షన్ స్టార్ గా కనిపించనున్నాడు.

సరిపోదా శనివారం సినిమాతో నాని మాస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. తప్పకుండా నాని రాబోయే సినిమాలు కూడా ఈ సక్సెస్ మేనియా కొనసాగిస్తాయని చెప్పొచ్చు. డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాని హిట్ 3 తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక నానితో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.