వివేక్ ఆత్రేయ.. మొత్తానికి ఎక్కేశాడు
క్రియేటివ్ ప్రెజెంటేషన్, మేకింగ్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.
By: Tupaki Desk | 31 Aug 2024 7:00 AM GMTక్రియేటివ్ ప్రెజెంటేషన్, మేకింగ్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఈ జెనరేషన్ లో చాలా మంది యంగ్ దర్శకులు టెక్నికల్ గా హైస్టాండర్డ్స్ లో కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో కాకుండా కథని వీలైనంత కొత్తగా చెప్పాలని అనుకుంటున్నారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. కొంతమంది రియాలిటీకి దగ్గరగా ఉండే కథలతో కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు.
మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి వివేక్ ఆత్రేయ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండే కథతోనే మూవీ చేశాడు. మొదటి సినిమాతోనే వివేక్ మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా క్లాస్ టచ్ తో ఒక వర్గం ప్రేక్షకులకే కనెక్ట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ కి రీచ్ కాలేదు. తరువాత చేసిన బ్రోచేవారెవరురా కామెడీ కథాంశంతో చేసి మెప్పించాడు. ఇది కూడా ఓ పరిధి మేరకే రీచ్ అయ్యింది. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా వివేక్ ఆత్రేయని ఈ రెండు సినిమాలు పేరు తీసుకొచ్చాయి.
అయితే మరీ స్టార్ ఇమేజ్ అయితే ఇవ్వలేదు. అందరిలాగే ఉద్యోగం వదిలేసి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా కెరియర్ ఎంచుకున్నాడు. మొదటి రెండు సినిమాలలో తాను చూసిన కథలనే తెరపై ఇంటరెస్టింగ్ గా ఆవిష్కరించి సక్సెస్ లు అందుకున్నాడు. మూడో ప్రయత్నంగా నాచురల్ స్టార్ నానితో అంటే సుందరానికి చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఎంటర్టైన్మెంట్ బాగున్న కూడా సినిమా నిడివి ఎక్కువ కావడంతో ప్రేక్షకులని ఆకట్టుకోలేదు.
అయితే వివేక్ ఆత్రేయ క్రియేటివ్ విజన్ నానికి కనెక్ట్ కావడంతో మరో అవకాశం ఇచ్చాడు. ఈ సారి వివేక్ ఆత్రేయ కాస్తా కమర్షియల్ అంశాలు జోడించి డిఫరెంట్ ఐడియాతో మాస్ యాంగిల్ గా సరిపోదా శనివారం సినిమా కథని చెప్పాడు. అలాగే తనకి నచ్చే ఫ్యామిలీ ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కూడా కథలో అంతర్లీనంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కి సైతం వివేక్ ఆత్రేయ దూరంగా ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో కరెక్ట్ గా ఉండేలా చూసుకొని సక్సెస్ అందుకున్నాడు.
సరిపోదా శనివారం సినిమాతో మాస్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న వివేక్ ఆత్రేయ అందరి దృష్టిని ఆకర్షించాడు. హై రేంజ్ ఉన్న పెద్ద కథలని, స్టార్ హీరోలని సైతం కూడా హ్యాండిల్ చేయగలడనే స్ట్రాంగ్ పవర్ ను అందరికి రీచ్ అయ్యేలా చేసుకున్నాడు. ఈ మూవీ లాంగ్ రన్ లో దసరా సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే నెక్స్ట్ టాలీవుడ్ లో సుజిత్ తరహాలో యంగ్ స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి వివేక్ ఆత్రేయ వస్తాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.