Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

ఇద్దరు అనుకున్నట్టుగానే ఆడియన్స్ కు ఒక మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:35 AM GMT
డైరెక్టర్ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
X

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ నానితో అంతకుముందు అంటే సుందరానికీ సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ కొంతమంది ఆడియన్స్ ని మెప్పించింది. అందుకే ఈసారి కొడితే కమర్షియల్ హిట్ కొట్టాలని కసితో కలిసి పనిచేశారు వివేక్ ఆత్రేయ, నాని. ఇద్దరు అనుకున్నట్టుగానే ఆడియన్స్ కు ఒక మంచి మాస్ ఫీస్ట్ ఇచ్చారు. నాని కెరీర్ లో సరిపోదా శనివారం సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది.

ఈ సినిమా సక్సెస్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. కామన్ గా అయితే సినిమా హిట్ కొట్టేశారు కాబట్టి సినిమా కోసం పడిన కష్టాన్ని చెబితే సరిపోతుంది. కానీ దర్శకుల్లో వివేక్ ఆత్రేయ వేరయా అనేలా హిట్ అయిన సినిమా రైటింగ్ విషయంలో ఇంకా తన అసంతృప్తి వెల్లబుచ్చుతూ రైటింగ్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయని చెప్పుకొచ్చాడు. సినిమా సూపర్ హిట్ అయ్యి సక్సెస్ మీట్ జరుగుతున్న టైం లో డైరెక్టర్ తన రైటింగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడటం కొత్తగా అనిపించింది.

సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ కాదు తన రైటింగ్ ఇంకాస్త బాగా రాయాల్సింది అన్నట్టుగా వివేక్ ఆత్రేయ ప్రస్తావించాడు. అంతేకాదు తన తప్పులను నాని, ఎస్ జే సూర్య లాంటి వారి నటన కవర్ చేసిందని అన్నారు. అక్కడే అతని గట్స్ ఏంటన్నది అర్థమవుతుంది. హిట్ అయిన సినిమాకు అసలు ఇవేవి చెప్పాల్సిన అవసరం లేదు కానీ తన సిన్సియారిటీ ఏంటన్నది అతని మాటల్లోనే తెలుస్తుంది. ఇలాంటి దర్శకుల సినిమాలు ఆడాలి.. ఇంకా ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ పనితనం ఏంటన్నది చూపించింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో వివేక్ స్టార్ హీరోలతో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి సక్సెస్ అందుకుంటాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికి సరిపోదా శనివారం సక్సెస్ జోష్ లో ఉన్న ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది చూడాలి. సరిపోదా శనివారం సక్సెస్ తో డైరెక్టర్ గా తన స్టామినా చూపించిన వివేక్ రాబోయే సినిమాలతో కూడా ఇదే విధంగా అద్భుతాలు చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు.