Begin typing your search above and press return to search.

మేనేజ‌ర్ తీరుతో న‌టుడుకి షాక్ ఇచ్చిన డైరెక్ట‌ర్!

తాజాగా ఓ మేనేజ‌ర్ చేసిన త‌ప్పుకు త‌న సినిమాలో న‌టుడ్ని తానే స్వ‌యంగా తీసేన‌ని తెలిపాడు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 2:30 PM GMT
మేనేజ‌ర్ తీరుతో న‌టుడుకి షాక్ ఇచ్చిన డైరెక్ట‌ర్!
X

బాలీవుడ్ డైరెక్ట‌ర్ వివేక్ అగ్ని హోత్రి ముక్కు సూటి త‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప‌రిస్థితుల్ని ఎండ‌గ‌ట్ట‌డంలో ముందుంటాడు. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగానూ వివేక్ పేరుంది. అందుకు త‌గ్గట్టే అత‌డి సినిమాలుంటాయి. తాజాగా ఓ మేనేజ‌ర్ చేసిన త‌ప్పుకు త‌న సినిమాలో న‌టుడ్ని తానే స్వ‌యంగా తీసేన‌ని తెలిపాడు.

పేరొందిన ఏజెన్సీకి చెందిన మేనేజ‌ర్ ఎంతో పొగ‌రు, అహంకారంతో వ్య‌వ‌రించాడ‌ని, అది న‌చ్చ‌క న‌టుడ్ని సినిమా నుంచి తీసేసాను అన్నారు. కానీ ఆ న‌టుడు ఎవ‌రు అన్న‌ది చెప్ప‌లేదు. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ప‌రిస్థితుల‌ను ఉద్దేశించి క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ ముఖేష్ ఇటీవ‌ల ఓ పోస్ట్ పెట్టాడు. `ఒక న‌టుడు..200 మంది క్యాస్టింగ్ ద‌ర్శ‌కులు., 15680మంది మేనేజ‌ర్లు ఇలా ఉంది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌రిస్థితి` అని పోస్ట్ చేసాడు. దీనిపై వివేక్ అగ్నిహోత్ని ఇలా స్పందించాడు.

`మేనేజ‌ర్ పొగ‌రు కార‌ణంగానే గ‌త వారం నేనొక న‌టుడ్ని తొల‌గించా. ఒక పేరొందిన సెల‌బ్రిటీ స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీకి చెందిన అత‌డు అలా ప్ర‌వ‌ర్తించ‌డం త‌న హ‌క్కుగా భావించాడు. అలాంటి మ‌ధ్య‌వ‌ర్తులు ఎంతో మంది కెరీర్ ని నిల‌బెట్టాల్సింది పోయి నాశ‌నం చేస్తున్నారు. వ‌ర్క్ షాప్ నిర్వ‌హించి అలాంటి వారికిప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ ఇవ్వండి` అని అన్నారు.

దీంతో అగ్నిహోత్రి సినిమాలో ఎంపికైనా మిగ‌తా నటులు అలెర్ట్ అయ్యారు. డైరెక్ట‌ర్ తో జాగ్ర‌త్త‌గా ఉండాలి? అని అగ్ని హోత్రి ఆ ర‌కంగా త‌న సినిమాలో న‌టుల‌కు హెచ్చ‌రిక జారీ చేసిన‌ట్లు అయింది. `ది క‌శ్మీర్ ఫైల్స్` సినిమాతో వివేక్ అగ్ని హోత్రికి మంచిపేరొచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌శ్మీరీ పండితుల‌పై జ‌రిగిన దాడుల్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చాలా వివాదాలు కూడా ఎదుర్కుంది.