రామ్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!
అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు.
By: Tupaki Desk | 25 Nov 2024 11:33 AM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ 22వ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ కి జోడీగా భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది. యంగ్ మేకర్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా రామ్ కోసం సంగీత ద్వయాన్నే దింపుతున్నారు.
వివేక్-మెర్విన్గా ప్రసిద్ధి చెందిన వివేక్ శివ -మెర్విన్ సోలమన్ల ప్రతిభావంతులైన సంగీత దర్శకులుగా తీసుకున్నారు. ఇద్దరు తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు. ఇప్పటివకే ఓ పదిహేను సినిమాలకు సంగీతం అందించారు. ధనుష్, విజయ్ సేతుపతి, నయనతార, త్రిష నటించిన చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించి ఫేమస్ అయ్యారు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మరింత బిజీ అవుతున్నారు. విజయ్ ఆంటోనీ నటించిన చిత్రాలకు సంగీతం..ఆర్ ఆర్ ఆందించి ఫేమస్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే మైత్రీమూవీ మేకర్స్ ఈ సంగీత ద్వయాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాకి ఇంత వరకూ పనిచేయలేదు. తొలిసారి రామ్ సినిమాకి పని చేయడం విశేషం. మరి ఎలాంటి బీట్స్ ఇస్తారో చూడాలి. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు 2012లోఅంబూలీ సినిమాతో లాంచ్ అయ్యారు. తర్వాత జై హీరోగా నటించిన వడకర్రీకి సంగీతం అందించారు. అటుపై త్రిష నటించిన మోహనీ, నయనతార నటించిన డోరా చిత్రాలకు సంగీతం అందించారు.
ఆ రెండు హారర్ చిత్రాలకు వైవిథ్యమైన సంగీతాన్ని అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ధనుష్ హీరోగా నటించిన పటాస్ చిత్రానికి వీళ్లే సంగీతం అందిచారు. అప్పటి నుంచి అవకాశాలు పెరిగాయి. స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్ లు చేస్తున్నారు.