పార్టీలో అతిథుల్ని వదిలేసి 9PM బెడ్‌పైకి వెళ్లే హీరో
'త్వరగా పడు కోవడం, త్వరగా లేవడం' పెద్దలు అనుసరించిన విధానం. బ్రహ్మ ముహూర్తంలో యోగ సాధకుడికి నిండు నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించాడు భగవంతుడు.
By: Tupaki Desk | 24 Jan 2025 6:30 PM GMT`త్వరగా పడు కోవడం, త్వరగా లేవడం` పెద్దలు అనుసరించిన విధానం. బ్రహ్మ ముహూర్తంలో యోగ సాధకుడికి నిండు నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించాడు భగవంతుడు. ఇది సనాతన ధర్మంలో యోగుల విధానం. ఇప్పటికీ అలాంటి అలవాట్లు ఉన్నవాళ్లకు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెబుతారు. కానీ దీనిని పాటించేది ఎందరు?
క్రమశిక్షణ కలిగిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లాంటి కొందరు మాత్రమే దీనిని పాటిస్తారు. సాయంత్రం 9 గం.కే నిదురించి తెల్లవారు ఝామున లేచి వ్యాయామం చేయడం అక్షయ్ కమార్ అలవాటు. అతడిది ఆర్మీ క్రమశిక్షణ. తండ్రి వారసత్వంగా వచ్చింది. అందుకే అతడు 50 ప్లస్ వయసులోను సూపర్ ఫిట్ గా ఉండే స్టార్లలో ఒకడిగా ఉన్నాడు. కానీ అతడి అలవాట్లను కూడా ప్రభావితం చేయాలనుకున్న వారిని అతడు చాలా లైట్ తీస్కున్నాడనేది సన్నిహితుల ఒక వాదన.
ఓసారి తన ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ సహా పలువురు స్టార్లు ఎటెండయ్యారు. కానీ ఆ పార్టీలో సరిగ్గా 9పీఎం అవ్వగానే అతడు అక్కడి నుంచి నిష్కృమించాడు. ఓవైపు పార్టీ జరుగుతోంది. తాగే వాళ్లు తాగుతున్నారు. తినేవాళ్లు తింటున్నారు. కానీ అక్షయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు అలా వెళ్లడాన్ని చూసిన వారంతా, వాష్ రూమ్ కి వెళుతున్నాడని అనుకున్నారట. కానీ మిడ్ నైట్ అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా మేడ కింద జరుగుతున్న పార్టీ ప్లేస్ కి వచ్చి, అక్షయ్ ఆల్రెడీ నిదురపోయాడని తెల్లవారుఝామున త్వరగా లేచే అలవాటు ఉందని సెలవిచ్చిందట. అక్షయ్ కుమార్ పార్టీలు పెట్టినా కేవలం 2 గంటల లోపు ముగించాలని అనుకుంటారు. అంతకంటే ఎక్కువ సమయం వారితో గడపలేరని కూడా ఒక టాక్ ఉంది.
ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వివేక్ ఒబెరాయ్. అక్షయ్ సర్ క్రమశిక్షణ వేరు. ఆయన ఆరోజు పార్టీ నుంచి 9 గం.లకే వెళ్లిపోయాడు. వాష్ రూమ్ కి వెళ్లాడని అనుకుంటే ట్వింకిల్ మామ్ వచ్చి అలా చెప్పారు! అంటూ షాకిచ్చాడు. ఇదంతా దేనికీ అంటే అక్షయ్ సర్ క్రమశిక్షణ అలాంటిది అంటూ అతడు వ్యాఖ్యానించాడు. అయితే ఖిలాడీ అక్షయ్ ఇప్పుడు దీనిని ఖండించాడు. తాను తన ఇంటి పార్టీలకు అతిథులు వచ్చినప్పుడు పార్టీ సాంతం పూర్తయ్యేవరకూ వారితోనే ఉంటానని, అతిథులంతా ఇళ్లకు వెళ్లేందుకు కార్లు ఎక్కేవరకూ సాగనంపేందుకు వారితోనే ఉంటానని చెప్పాడు.