ఇండస్ట్రీలో పోరాటాల గురించి ఓపెనైన హీరో
ఇది ప్రతిఫలదాయకమైన సాధన కంటే ఎక్కువ శ్రమతో కూడిన పోరాటంలా అనిపించిందని అన్నాడు.
By: Tupaki Desk | 5 Dec 2024 2:30 AM GMT'రక్త చరిత్ర' ఫేం వివేక్ ఒబెరాయ్ తన కెరీర్ పోరాటం గురించి కఠినమైన నిజాల్ని మాట్లాడారు. అతడి బాలీవుడ్ ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎత్తుపల్లాలతో ఎగుడుదిగుడు ప్రయాణం సాగించానని అన్నారు. ఇటీవల అతడు సినిపరిశ్రమలోని అభద్రతా భావాల గురించి మాట్లాడాడు. అతడు తన హిట్ చిత్రం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' తర్వాత 15 నెలల పాటు ఉద్యోగం లేక నిరుద్యోగాన్ని ఎదుర్కొన్నానని సవాళ్లతో కూడుకున్న దశను గుర్తుచేసుకున్నాడు. నిరంతర ఒత్తిడి, టెన్షన్ అతడిని ఎలా దెబ్బతీశాయో కూడా తెలిపాడు. ఇది ప్రతిఫలదాయకమైన సాధన కంటే ఎక్కువ శ్రమతో కూడిన పోరాటంలా అనిపించిందని అన్నాడు.
తాజా ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ -''నేను 22 ఏళ్లలో దాదాపు 67 ప్రాజెక్ట్‌లు చేసాను.. కానీ పరిశ్రమ చాలా అభద్రతతో కూడుకున్న ప్రదేశం. మీరు బాగా నటించవచ్చు.. అవార్డులు గెలుచుకోవచ్చు.. నటుడిగా మీ పనిని మీరు చేయవచ్చు.. కానీ అదే సమయంలో మీరు ఏదీ పొందలేరు'' అని కూడా అన్నారు.
2007లో షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలాతో .. వైరల్ హిట్ పాట 'గణపత్'తో విజయం సాధించినప్పటికీ అతడు దాదాపు 15 నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నాడు. దీని గురించి ఒబెరాయ్ మాట్లాడుతూ-``2007 తర్వాత నేను లోఖండ్‌వాలాలో షూటౌట్ చేసినప్పుడు 'గణపత్' పాట వైరల్ అయ్యింది. నేను అవార్డులను గెలుచుకున్నాను.. కాబట్టి నేను చాలా ఆఫర్లు ఆశించాను.. కానీ నాకు ఏదీ రాలేదు. నేను ఇంట్లో కూర్చున్నాను. సినిమా విజయం సాధించిన తర్వాత 14 నుంచి 15 నెలల వరకు పని లేదు`` అని తెలిపాడు.
2009లో పరిశ్రమపై మాత్రమే ఆధారపడకుండా తన ఆర్థిక స్వాతంత్య్రాన్ని నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అది కీలక నిర్ణయానికి దారితీసిందని కూడా తెలిపాడు. బాహ్య శక్తులు తన భవిష్యత్తును నిర్దేశించనివ్వకూడదని లేదా తన కెరీర్ నిర్ణయాలను ప్రభావితం చేయకూడదని అతడు నొక్కి చెప్పాడు.
వివేక్ ఒబెరాయ్ వ్యాపారంలోకి అడుగు పెట్టడం తనకు ఎంత స్వేచ్ఛనిచ్చిందో వెల్లడించాడు. సినిమా అంటే తనకు ఎప్పటికీ ప్యాషన్ అయితే, వ్యాపారాన్ని జీవనోపాధి కోసం ప్లాన్ బిగా చూసుకున్నానని వివరించారు. ఇది అతడికి పరిశ్రమ అభద్రతాభావాల నుండి విముక్తి పొందడంలో సహాయపడింది. లాబీలపై ఆధారపడే ఒత్తిడిని తగ్గించడం.. విలువల విషయంలో రాజీలేకుండా పని చేయడం వంటి విషయాలలో సహకారం లభించిందని తెలిపాడు. స్వతంత్రతను కాపాడుకోవడం చాలా కీలకమైనది.. ఆత్మను అమ్ముకోవడం లేదా పని భద్రత కోసం ఇతరులకు పాండరింగ్ చేయాలనే ఆలోచనను అంగీకరించలేడు. మూడు చిత్రాలతో వివేక్ తన 22 ఏళ్ల బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రతిబింబించాడు. ''నేను చాలా విషయాల్లో ఒత్తిడికి గురయ్యాను.. చాలా టెన్షన్ తీసుకున్నాను.. అది ఏమంత విలువైనది కాదు'' అని చెప్పాడు. అతడి ప్రకారం.. మంచి చేయడం వల్ల ప్రతిఫలం వస్తుంది.. అయితే ప్రతికూలత దాని పరిణామాలను కలిగి ఉంటుంది. విజయం బాహ్యంగా కనిపించవచ్చు.. కానీ అది అంతర్గత శాంతికి హామీ ఇవ్వదని కూడా అతడు పేర్కొన్నాడు. జీవితం అనేది ఎంపికల గురించి.. సరైన వాటిని చేయడం వల్ల సానుకూల మార్పు వస్తుంది.
డబ్బు, కీర్తి , విజయం జీవితాన్ని మార్చే విధంగా భావించని దశలో తన వెంచర్‌లను విస్తరించడంపై దృష్టి సారించాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... మస్తీ 4 సహా మూడు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసాడు. రితీష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివదాసాని లతో కలిసి ఇందూజీ సినిమాలో నటిస్తున్నాడు. మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. మిగిలిన రెండు ప్రాజెక్ట్‌లు ప్రకటించాల్సి ఉంది.