Begin typing your search above and press return to search.

మిడిమిడి జ్ఞానంతో జీవితాన్ని గడిపేవాడిని: వివేక్ ఒబెరాయ్

విష‌పూరిత సంబంధాలు.. చెడు సావాసం కార‌ణంగా నాశ‌నం ఎలా మొద‌ల‌వుతుందో మాట్లాడాడు ప్ర‌ముఖ హీరో వివేక్ ఒబెరాయ్.

By:  Tupaki Desk   |   6 Dec 2024 3:25 AM GMT
మిడిమిడి జ్ఞానంతో జీవితాన్ని గడిపేవాడిని:  వివేక్ ఒబెరాయ్
X

విష‌పూరిత సంబంధాలు.. చెడు సావాసం కార‌ణంగా నాశ‌నం ఎలా మొద‌ల‌వుతుందో మాట్లాడాడు ప్ర‌ముఖ హీరో వివేక్ ఒబెరాయ్. తాను జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని కనుగొనకుంటే `ప్లాస్టిక్ స్మైల్స్` ఉన్న వ్యక్తుల చుట్టూ `ప్లాస్టిక్ జీవితంలో` ఇరుక్కుపోయేవాడినని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్‌- స‌ల్మాన్ ఖాన్‌లతో తన గత విభేదాల గురించి ఓపెన‌య్యాడు. ఆ ఇద్దరు నటుల గురించి వ్యాఖ్యానించమని కోర‌గా ``దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు`` అని చెప్పాడు. డాక్టర్ జై మదన్ యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించిన వివేక్ కొన్ని పేర్లపై స్పందించమని అడిగారు.

త‌న తల్లిదండ్రుల గురించి... ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ గురించి కూడా ఒబెరాయ్ వ్యాఖ్యానించాడు. ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ పైనా ప్ర‌శంస‌లు కురిపించారు. ``అతడు డార్లింగ్.. నిజంగా మంచి వ్యక్తి`` అని కితాబిచ్చారు. ఇప్పుడు తనను తాను పరోపకారి, వ్యాపారవేత్తగా అభివర్ణించుకున్న వివేక్ ఒబెరాయ్ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని కనుగొన్నందుకు ఆనందంగా ఉంది. మానసికంగా, వృత్తిపరంగా కష్టకాలం నుండి తిరిగి కోలుకోవ‌డం ఎద‌గ‌డం ...ఇప్ప‌టికి తనను తాను కనుగొన్న మార్గాన్ని అది ప్రభావితం చేసిందా? అని ప్ర‌శ్నించ‌గా.. వివేక్ ఇలా అన్నాడు, ``బహుశా నేను మిడిమిడి జ్ఞానంతో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని. ప్లాస్టిక్ చిరునవ్వుతో ఉన్న వ్యక్తుల మధ్య బహుశా నేనే ప్లాస్టిక్‌గా మారి ఉండేవాడిని. ప్రజలు నన్ను ఇప్పుడు ట్రోల్ చేస్తే పట్టించుకోను. జీవితంలో నా ఉద్దేశ్యం నాకు తెలుసు కాబట్టి, నాకు అత్యంత ముఖ్యమైనది ఏమిటో నాకు మాత్ర‌మే తెలుసు. సెలబ్రిటీగా ఉండటం అనేది ఒకరి అనుభవాలను పెంచుతుంద‌ని వివేక్ అన్నారు.

బ్రేక‌ప్ అయిన జంట‌ల‌కు స‌ల‌హా ఇవ్వ‌మ‌ని కోర‌గా... ఎవరైనా మీ ప్రేమికుల‌ను విడిచిపెట్టినట్లయితే ఈ విధంగా ఆలోచించండి. ఒక పిల్లవాడు తన లాలీపాప్‌ను బురదలో పడవేస్తాడు. అది మురికిగా ఉన్నందున అతడి తల్లి దానిని తినడానికి అనుమతించదు.. అవునా? జీవితం మీకు కొత్త భాగస్వామిని ఇస్తుంది`` అని తెలిపాడు. ``మీరు నొప్పి(పాత ప్రియురాలి)తో ఎక్కువ కాలం ఉంటే ఆ నొప్పి మరింత పెరుగుతుందని అతడు చెప్పాడు. నేను వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు మ‌నం చెత్త‌ సంబంధాలలోకి వెళ్తాము. వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. వ్యక్తులు మిమ్మల్ని విలువైనవారిగా పరిగణించరు.. మిమ్మల్ని గౌరవించరు. మీరు మీ స్వీయ-విలువను గుర్తించనందున మీరు ఆ సంబంధంలోకి ప్రవేశిస్తారు..అని కూడా అన్నారు.