Begin typing your search above and press return to search.

కలెక్షన్స్ స్కామ్ అంటున్న డైరెక్టర్!

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన వ్యక్తిగా వివేక్ అగ్నిహోత్రి మారిపోయారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 2:30 PM GMT
కలెక్షన్స్ స్కామ్ అంటున్న డైరెక్టర్!
X

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన వ్యక్తిగా వివేక్ అగ్నిహోత్రి మారిపోయారు. హిందుత్వ భావజాలం ఉన్న అందరూ ఈ మూవీని, అలాగే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ప్రశంసించారు. అయితే లౌకికవాదం అంటూ సెక్యులరిస్టులుగా తమ గురించి తాము చెప్పుకునేవారు. ముస్లిం సంఘాలు ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ అంతా బద్ధం అని, అందులో వాస్తవాలు పూర్తిగా వక్రీకరించి చూపించారని విమర్శలు చేశారు.

ఏది ఏమైనా ఆ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా మెజారిటీ సెలబ్రెటీలు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాని వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి నుంచి ది వ్యాక్సిన్ వార్ మూవీ సెప్టెంబర్ 28న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రంలో నానా పటేకర్ కీలక పాత్రలో నటించాడు. కరోనా క్లిష్ట సమయంలో మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీ కోసం ఎంత కష్టపడ్డారు ఈ చిత్రంలో చూపించారు.

ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ అనేది అతి పెద్ద స్కామ్ అని, కావాలని లేని కలెక్షన్స్ కూడా ఉన్నట్లు ప్రాజెక్ట్ చేసుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తాను తీసిన ది వ్యాక్సిన్ వార్ మూవీని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు.

కరోనా సమయంలో మన శాస్త్రవేత్తలు ప్రాణాలు పణంగా పెట్టి వ్యాక్సిన్ ఎలా తరాలు చేశారు లైవ్ సంఘటనలతో ఈ చిత్రాన్ని ఆవిష్కరించడం జరిగిందని వివేక్ తెలిపారు. కుటుంబం అంతా కలిసి చూడగలిగే ఎమోషన్స్ చిత్రంలో ఉంటాయని అన్నారు. ఇదిలా ఉంటే గతంలో ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని సలార్ కి పోటీగా వివేక్ అగ్నిహోత్రి రిలీజ్ ఎనౌన్స్ చేశారు.

ఆ సమయంలో పరోక్షంగా ప్రభాస్ పై అతను వ్యాఖ్యలు కూడా చేశారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. సలార్ మూవీ వాయిదా పడటంతో అది ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ చిత్రానికి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.