వైజయంతీ 50 వేళ్ల వేడుక ప్లాన్ చేస్తున్నారా?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థది ఎంతో ప్రత్యేకమైన స్థానం.
By: Tupaki Desk | 3 July 2024 6:33 AM GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థది ఎంతో ప్రత్యేకమైన స్థానం. స్వర్గీయన నందమూరి తారకరామారావు చేతులు మీదుగా ప్రారంభమైన సంస్థ అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. తొలి సినిమా `ఎదురులేని మనిషి` అన్న ఎన్టీఆర్ తోనే నిర్మించారు. 1974 లో ప్రారంభమైన సంస్థ 1975 నుంచి సినిమాలు నిర్మిస్తూ వస్తోంది.
నేటికి ఆ సంస్థ దిగ్విజయంగా ముందుకు దూసుకు పోతుంది. ప్రస్తుతం ఆ సంస్థ స్థాపకుడు అశ్వినీదత్ ఆధ్వర్యంలో ఆయన కుమార్తెలు స్వప్నా దత్- ప్రియాంక దత్ లు చూసుకుంటున్నారు. వాళ్ల ఎంట్రీ తర్వాత సంస్థ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. తాజాగా వైజయంతీ సంస్థ ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో ఐదు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున ఈవెంట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది.
అయితే ఇదే ఏడాది `కల్కి 2898` విజయంతో వైజయంతీ సంస్థ పాన్ ఇండియాకి చేరడం విశేషం. ఇటీవల రిలీజ్ అయిన కల్కి సినిమా ఎలాంటి విజయం నమోదు చేసిందో తెలిసిందే. వైజయంతిలో భారీ బడ్జెట్ తో నిర్మాణమైన తొలి సినిమా ఇదే. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లన సాధిస్తుంది. ఇప్పటివరకూ 600 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. దత్ లెక్క ప్రకారం సినిమా 1500 కోట్లు తేవాలి. మరి ఆ మార్క్ చేరుతుందా? లేదా? అన్నది చూడాలి.
అయితే కల్కి విజయోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించే ప్లాన్ లో నిర్మాతలు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 50 ఏళ్ల వేడుక కూడా అదే వేదికపై నిర్వహిస్తారా? లేక ప్రత్యేకంగా సంస్థ తరుపున ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాలి. ఈ ఏడాది నిర్వహించకపోతే వచ్చే ఏడాదైనా గ్రాండ్ గా 50 ఏళ్ల వేడుక చేయడానికి ఆస్కారం ఉందని ప్రచారం సాగుతోంది.