వ్యూహం ఊపిరిపోసుకునేది ఎప్పుడు?
'వ్యూహం' సినిమా ప్రకటనతో రాంగోపాల్ వర్మ మరోసారి సంలచనమైన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 Jan 2024 12:22 PM GMT'వ్యూహం' సినిమా ప్రకటనతో రాంగోపాల్ వర్మ మరోసారి సంలచనమైన సంగతి తెలిసిందే. అటుపై రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ప్రతీది టీడీపీని..నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్లు ఉండటంతో సీన్ మరింత వెడెక్కింది. 'వ్యూహం' వెనుక రాజకీయ కుట్ర ఉందా? ఆ కోణంలోనే ఈసినిమా చేసారా? ఇలా రకరకాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే ఓ క్రియేటర్ ఎవ్వరూ ఆపలేరంటూ..తన స్వేచ్ఛని హరించడానికి లేదంటూ వర్మ ఈ సినిమా ఎలాగూ పూర్తి చేసాడు. ఇంతవరకూ అంతా సంతోషంగానే జరిగిపోయింది.
అయితే రిలీజ్ సమయం వచ్చేసరికి నారా లోకేష్ ఈ సినిమాపై కేసులు వేయడంతో రిలీజ్ ఒక్కసా రిగా..ఆగడం అది కోర్టుల చుట్టూ తిరగడం..సెన్సార్ అయినా కూడా రిలీజ్ కి కోర్టులు ఎందుకు అడ్డు తగులుతున్నాయంటూ వాదనలు తెరపైకి రావడంతో! వర్మ వ్యూహం లో చిక్కుకున్నట్లు అయింది. ఎలాగైనా ఈ సినిమాని బయటకు తీసుకురావలని వర్మ అండ్ కో గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది.
తొలుత ఈ వ్యవహారం సిటీ సివిల్ కోర్టులో తేల్చుకోమని చెప్పినా! ఆ తర్వాత కోర్టు విచారణ జరిపింది. దీంతో రిలీజ్ విషయంలో తాడో పేడో తేలిపోతుందని అంతా భావించారు. కానీ మరోసారి వ్యూహానికి చుక్కెదురైంది. ఈ సినిమాకి సంబంధించి కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కమిటీలో పిటీషన్ తరుపువారు..అటు ప్రతివాదులైన చిత్ర యూనిట్ కి సంబంధించిన వారు ఉండాలని పేర్కొంది. కమిటీలో ఎవరు ఉండాలన్నది వాళ్లనే తేల్చుకోమని కోర్టు చెప్పింది.
వాళ్లంతా సినిమా చూసి ఓ నిర్ణయానికి రావాలని.. ఇదంతా రహస్యంగా జరిగాలని..ఎవరి నివేదిక వారు స్వయంగా కోర్టుకు సమర్పించాలని సూచించింది. అయితే సెన్సార్ బోర్డ్..చిత్ర యూనిట్ అందుకు విముఖత చూపించింది. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు సరికాదని ప్రతివాదుల తురుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసు ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని తెలుస్తోంది.