'వ్యూహం' ట్రైలర్.. వర్మ జగన్ ఎలివేషన్
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై 'వ్యూహం' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 15 Dec 2023 11:32 AM GMTటాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై 'వ్యూహం' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'U' సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నెలాఖరులో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవి వ్యూహం మూవీ సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు.
ఈ ట్రైలర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది.' ఇంతకాలం మిమ్మల్ని పైకి రాకుండా తొక్కేసిన మనిషి ఇప్పుడు పైకే పోయాడు. ఇక మీరే' అంటూ చంద్రబాబు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది.' ఓదార్పు యాత్రలో జనం వచ్చింది నాన్న మీద ప్రేమతో.. ఆయన మరణం తర్వాత కోట్లాదిమంది నాపై పెట్టుకున్న ఆశలు చలించిపోయాను' అనే డైలాగ్ తో వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేశారు.
'ఒక విషయాన్ని నిజమో అబద్దమో తెలియాలంటే జీవితకాలం కూడా సరిపోవు' క్షవరం అయితే కానీ వివరం తెలియదు' వంటి సెటైరికల్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టడం, జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటకు వచ్చి పాదయాత్ర చేపట్టడం వంటి అంశాలను ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. అలాగే ఆర్జీవి పాడిన పాట బ్యాక్ గ్రౌండ్ లో హైలెట్ చేశారు.
' నా వెనుక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు' అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెప్పడం, కోపంతో వెళుతున్న సమయంలో కొత్త పార్టీ పెట్టేలా ఉన్నాడు అంటూ పక్కనే ఉన్న వ్యక్తి చెప్పడం, ఆ తర్వాత 'నువ్వు నా గురించి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేయాలి. మీకు ఒక ప్యాకేజ్ ఇస్తా' అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చెప్పడం, మనకు 150 సీట్లు వస్తాయి అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ ని బట్టి రాంగోపాల్ వర్మ ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతుంది.
ట్రైలర్లో పొలిటికల్ డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. టైలర్ చివర్లో వైయస్ జగన్ పాత్రధారి..' నా నిజాన్ని గుర్తించేలా చేస్తాను. ఇదే నా శపథం' అంటూ చెప్పే డైలాగ్ చూస్తే సినిమా అంతా జగన్ కి ఆర్జీవి సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. జగన్ని హైలెట్ చేస్తూ చివరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విలన్ గా చూపించినట్లు ఈ ట్రైలర్ ఉంది. ప్రస్తుతం వ్యూహం సెకండ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.