Begin typing your search above and press return to search.

ఒకే ఏడాది ఇన్ని ఎలా సాధ్యం అమ్మడు..!

మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా చేయాలనే ఆసక్తి ఈమె కనబర్చడం లేదు. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది.

By:  Tupaki Desk   |   22 Feb 2025 12:30 AM
ఒకే ఏడాది ఇన్ని ఎలా సాధ్యం అమ్మడు..!
X

సుధీర్ బాబు హీరోగా పదేళ్ల క్రితం వచ్చిన 'భలే మంచి రోజు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండి ఉండదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. కెరీర్ ఆరంభంలో జూనియర్‌ ఆర్టిస్టుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన వామికా గబ్బీ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. హీరోయిన్‌గా వామికా గబ్బీ ఇటీవలే బేబీ జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించినప్పటికీ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా చేయాలనే ఆసక్తి ఈమె కనబర్చడం లేదు. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. గత ఏడాది ఈమె నటించిన సినిమాలు బేబీ జాన్‌ తప్ప మరేది విడుదల కాలేదు. అందుకే ఈమధ్య కాలంలో వచ్చిన ప్రతి ఆఫర్‌కి ఓకే చెప్పింది. దాంతో ఈమె చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.

తెలుగులో భలే మంచి రోజు సినిమా తర్వాత ఇప్పటి వరకు నటించలేదు. ప్రస్తుతం అడవి శేష్‌తో కలిసి గూఢచారి 2 సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కానుంది. సమ్మర్‌ చివరి వరకు లేదా ఆగస్టులో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. వామికా గబ్బీ తెలుగు సినిమాతో పాటు తమిళ్‌, పంజాబీ, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. ఒకే సారి ఇన్ని భాషల్లో నటిస్తున్న హీరోయిన్‌ ఈమె అంటూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సగం సక్సెస్ అయినా పదేళ్ల పాటు ఈ అమ్మడి సినీ జర్నీ జెట్‌ స్పీడ్‌తో సాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అమ్మడు నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో గూఢచారి 2, హిందీలో దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్, భూత్‌ బంగ్లా, తమిళ్‌లో ఇరావాకాలం, జెనీ, మలయాళంలో టికి టాకా, పంజాబీలో కిక్లి సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు సైతం చర్చల దశలో ఉన్నాయి. గూఢచారి 2 సినిమా హిట్‌ అయితే తెలుగులో మరిన్ని సినిమాలను ఈ అమ్మడు చేసే అవకాశాలు ఉన్నాయి. నటిగా ఈమధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడికి మరో వైపు వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్ సిరీస్‌లో నటిస్తోంది. ఒకే ఏడాది ఇన్ని సినిమాలు, సిరీస్‌లు ఎలా చేస్తున్నావు అంటూ చాలా మంది షాక్ అవుతున్నారు. ఇన్ని ప్రాజెక్ట్‌లు ఒకే సమయంలో ఎలా చేస్తున్నావ్‌ అమ్మడు అంటూ ప్రశ్నిస్తున్నారు.