Begin typing your search above and press return to search.

వాల్తేరు వర్సెస్ దేవర... అనుకోకుండా జరిగిందా?

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   2 Jan 2024 5:00 AM
వాల్తేరు వర్సెస్ దేవర... అనుకోకుండా జరిగిందా?
X

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్‌ లుగా రాబోతున్న దేవర సినిమా మొదటి పార్ట్‌ ను ఈ ఏడాది ఏప్రిల్ లో సమమ్ర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.


దేవర సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా విడుదల చేస్తూ వచ్చిన పోస్టర్స్ ను చూస్తే వాల్తేరు వీరయ్య థీమ్‌ ను ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య మరియు దేవర మూడు పోస్టర్‌ లను పక్కన పెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ప్రీ లుక్ పోస్టర్‌ సహా మూడు పోస్టర్‌ లు కూడా వాల్తేరు వీరయ్య పోస్టర్స్ ను పోలి ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. ఆచార్య కోపం తోనే కొరటాల శివ ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం దీని వెనుక మరేమైనా ఉద్దేశం ఉందా అన్న కోణంలో చర్చించుకుంటున్నారు.

సముద్రంలోని నావ మీద చిరంజీవి ని ఎలా అయితే వాల్తేరు వీరయ్య ను చూపించారో దేవర సినిమాలో ఎన్టీఆర్‌ ను అచ్చు అలాగే చూపిస్తూ పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగిందా లేదంటే కావాలని చేసిందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ దేవర సినిమాపై అంచనాలు పెంచే విధంగా పోస్టర్స్ అయితే ఉన్నాయి కానీ, వాల్తేరు వీరయ్య సినిమా పోస్టర్స్ ను కాపీ కొట్టినట్లుగా ఉండటం వల్ల అసలేం జరుగుతుందా అంటూ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. వాల్తేరు వీరయ్య కథ ను పోలి ఉండదుగా అంటూ కొందరు మీమ్స్ చేస్తున్నారు. మరి కొరటాల ఏమని స్పందిస్తాడో చూడాలి.