Begin typing your search above and press return to search.

ఫోటో షూట్: పంజాబీ బ్యూటీ వామిక స్ట‌న్నింగ్ లుక్

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో బాలీవుడ్ లో బిజీ నాయిక‌గా వెలుగుతోంది వామికా గ‌బ్బి.

By:  Tupaki Desk   |   17 March 2025 9:47 AM IST
ఫోటో షూట్: పంజాబీ బ్యూటీ వామిక స్ట‌న్నింగ్ లుక్
X

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో బాలీవుడ్ లో బిజీ నాయిక‌గా వెలుగుతోంది వామికా గ‌బ్బి. ఈ బ్యూటీ పంజాబీ, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో న‌టిస్తోంది. ఇటీవ‌ల‌ వెబ్ సిరీస్ లలో వైవిధ్యమైన పాత్ర‌ల‌తో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. వరుణ్ ధావన్ - కీర్తి సురేష్ లతో కలిసి యాక్షన్-థ్రిల్లర్ బేబీ జాన్ లో క‌నిపించింది. ఈ సినిమా ఫ్లాపైనా వామిక‌ను నేషనల్ క్రష్ అంటూ అభిమానులు పొగిడేసారు. తన అందం ఆక‌ర్ష‌ణ‌తో ఆ రేంజు ఫాలోయింగ్ తెచ్చుకుంది.


వామికా గబ్బి ఎవరు? అంటే... బాలీవుడ్ క్లాసిక్ జబ్ వి మెట్ లో ఒక చిన్న పాత్రతో బాలనటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. త‌న యుక్త‌వ‌య‌సులో క‌థానాయిక‌గా మారిపోయింది, తు మేరా 22 మై తేరా 22, ఇష్క్ బ్రాందీ, లాంటి చిత్రాల్లో న‌టించింది. నిక్కా జైల్దార్ సిరీస్ విజయంతో పంజాబీ సినీప‌రిశ్ర‌మ‌లోను గుర్తింపు పొందింది.


వామికా గబ్బి చండీగఢ్‌కు చెందిన పంజాబీ కుటుంబానికి చెందిన యువ‌తి. తండ్రి గోవర్ధన్ గబ్బి, `గబ్బీ` అనే మారుపేరుతో హిందీ - పంజాబీ రెండింటిలోనూ ప్రఖ్యాత రచయిత. చండీగఢ్‌లోని సెయింట్ జేవియర్స్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను పూర్తి చేసింది. చండీగఢ్‌లోని డిఏవీ కళాశాల నుండి ఆర్ట్స్‌లో డిగ్రీని పొందింది. సాహిత్య వాతావరణంలో పెరిగిన వామిక‌ వినోద పరిశ్రమలో సృజనాత్మకంగా రాణించాల‌ని క‌ల‌లు కంది.


ఈ బ్యూటీ రొమాంటిక్ డ్రామా మాలై నెరతు మయక్కంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. గోధాతో మలయాళ సినీరంగంలోను ఆరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పంజాబీ రెజ్లర్‌గా నటించింది. గోధాలో వామిక‌ నటనకు విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి. హిందీ వెబ్ సిరీస్ గ్రహణ్‌, మై: ఎ మదర్స్ రేజ్, మోడరన్ లవ్: ముంబై లాంటి సిరీస్ ల‌తో వామిక‌ గబ్బి అంద‌రి దృష్టిని ఆకర్షించింది.


వామిక సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తాజాగా వామిక యూనిక్ అండ్ బోల్డ్ లుక్ ఫోటోషూట్ అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకుంది. బ్రింజాల్ క‌ల‌ర్ డిజైనర్ ఫ్రాక్‌లో వామిక స్ట‌న్నింగ్ ఫోజులు ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.