నితీష్ రామాయణం.. వాంటెడ్ లక్ష్మణ్
లార్డ్ శ్రీరాముడి సోదరుడు, అంగరక్షకుడు అయిన లక్ష్మణ్ పాత్రను అమితాబ్ మనవడు అగస్త్య నందకు ఆఫర్ చేయగా, అతడు తిరస్కరించినట్లు కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 12 Oct 2023 4:19 AM GMTప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పురాణేతిహాసం రామాయణం స్ఫూర్తితో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిటిక్స్ సహా ప్రజల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఆ తర్వాత దర్శకుడు ఓంరౌత్ పూర్తి స్థబ్ధుగా ఉండడంతో అతడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడంటూ బాలీవుడ్ మీడియా సెటైర్లు వేసింది. అయితే ఈ అనుభవాల నేపథ్యంలో బాలీవుడ్ దర్శకనిర్మాత నితీష్ తివారీ రామాయణంపై మరో సినిమా తీయాలనే ఆలోచన చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
కానీ నితీష్ 'రామాయణం' ఇక ఆగదు. ఇప్పటికే శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎంపిక కాగా, సీతగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి ఎంపికైందని కథనాలొచ్చాయి. రావణ్ గా KGF 2 స్టార్ యష్ ఎంపికయ్యాడని ప్రచారమైంది. లార్డ్ హనుమంతుడిగా నటించడానికి సన్నీ డియోల్ తో చర్చలు సాగిస్తున్నారని కథనాలొచ్చాయి. అయితే లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారు? అన్నదానిపై స్పష్ఠత లేదు. లార్డ్ శ్రీరాముడి సోదరుడు, అంగరక్షకుడు అయిన లక్ష్మణ్ పాత్రను అమితాబ్ మనవడు అగస్త్య నందకు ఆఫర్ చేయగా, అతడు తిరస్కరించినట్లు కథనాలొస్తున్నాయి.
డెబ్యూ హీరో ఎందుకు సంతకం చేయలేదు?
తాజా కథనాల ప్రకారం... అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ఈ పౌరాణిక డ్రామాలో భాగం కావడానికి నిరాకరించారు. రెడిఫ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. అగస్త్యకు ఊపిరాడని షెడ్యూల్ ఉంది. వరుస ఆఫర్లతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నందున ఈ క్రేజీ చిత్రంలో భాగం కావడానికి నిరాకరించాడు. అతడు జోయా అక్తర్ 'ది ఆర్చీస్'తో తెరంగేట్రం చేయనున్నాడు. ఆపై శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించనున్న 'ఎక్కిస్' అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఆర్చీస్‌లో అగస్త్యతో పాటు నటవారసులు సుహానా ఖాన్, ఖుషీ కపూర్ తదితరులు నటించారు. ఇది డిసెంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
అంతేకాకుండా అగస్త్య గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. అతడు తన కెరీర్‌లోని ఈ దశలోను సెకండ్ లీడ్ పాత్రల్లో నటించడని కూడా సోర్స్ చెబుతోంది. బిగ్ బి లెగసీని ముందుకు నడిపించే సిసలైన వారసుడు అగస్త్య అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇది యువనటుడికి ప్రారంభం మాత్రమే.. కెరీర్ పరంగా కేవలం కథానాయకుడిగా మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాడని తెలిసింది.
కారణం ఏదైనా కానీ నితీష్ తివారీ శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడిని కనుగొనడానికి చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా మంది నటులు మల్టీ-స్టారర్‌లలో నటించడానికి ఆసక్తిగా లేరు. ఇక ప్రధాన పాత్ర అయిన శ్రీరాముడికి తమ్ముడిగా ఉండడం అంటే ఒక సైడ్ క్యారెక్టరేనన్న అభిప్రాయం ఉంది. దానివల్ల కూడా నటవారసులు అలాంటి అవకాశాన్ని స్వీకరించరు అని కూడా విశ్లేషిస్తున్నారు.