వార్ 2 క్లైమాక్స్.. ఎన్టీఆర్ కోసం భల్లూకాల్ని బరిలో దించారు!
సినిమా మొత్తం ఒకెత్తు అనుకుంటే పతాక సన్నివేశంలో వచ్చే యాక్షన్, ఎమోషన్ ని పీక్స్ కి చేర్చాలి.
By: Tupaki Desk | 29 Nov 2024 3:30 PM GMTప్రతి సినిమాకి ఆరంభం.. ప్రథమార్థంలో టేకాఫ్.. ప్రీవిరామం.. ప్రీక్లైమాక్స్.. క్లైమాక్స్ .. ఇవన్నీ ఎంతో కీలకమైనవి. అప్పుడప్పుడు గ్రాఫ్‌ని పైకి లేపుతూ దర్శకుడు చివరికి వచ్చేసరికి క్లైమాక్స్ లో భల్లూక పోరాటాలు చూపించాలి. సినిమా మొత్తం ఒకెత్తు అనుకుంటే పతాక సన్నివేశంలో వచ్చే యాక్షన్, ఎమోషన్ ని పీక్స్ కి చేర్చాలి. ఈ విషయంలో ఎక్కడ ఫెయిలైనా `క్లైమాక్స్ పోయింది సినిమా పోయింది!` అని తేల్చేస్తారు ప్రజలు.
అందుకే అలాంటి పొరపాట్లు జరగకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు వార్ 2 కోసం అలాంటి జాగ్రత్తలెన్నిటినో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ తీసుకుంటోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 విషయంలో చాలా స్పష్ఠంగా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు. వార్ 2 షూట్‌లో చివరి వరకు ఉత్తమమైన వాటిని సేవ్ చేసి ఉంచాడని... గత కొన్ని నెలలుగా అతడు విమానం సెట్ వేసి అందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాడని తెలుస్తోంది. టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో ఫైట్స్ తీసాడు. జపనీస్ సమురాయ్ లతో పోరాటం ఇందులో ప్రధాన హైలైట్ అని తెలిసింది. ఈ సీన్ లో హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ భీకర పోరాటాలు చేస్తారు. ప్రీక్లైమాక్స్ లో విలన్ వర్సెస్ హీరో పోరాటాలు ఆద్యంతం రక్తి కట్టిస్తాయని సమాచారం. ఇద్దరు ప్రధాన నటులు ముంబైలో క్లైమాక్స్ చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. 15 రోజుల షెడ్యూల్‌లో ఇది పూర్తవుతుంది. విలన్ రహస్య ప్రాంతంలో పోరాటాలు ఉంటాయి. ఇక క్లైమాక్స్ కోసం ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ - జవాన్ లాంటి చిత్రాలకు పనిచేసిన స్టంట్ డైరెక్టర్లను ఎంపిక చేసుకున్నారు.
డిసెంబర్ రెండవ వారం నుండి జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ మధ్య ఫేసాఫ్ పోరాటాన్ని చిత్రీకరిస్తారు. దీనిని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీ, అంధేరిలోని వైఆర్‌ఎఫ్ స్టూడియోస్‌లో చిత్రీకరించనున్నారు. గోరెగావ్ ఫిల్మ్ సిటీలో జూనియర్ ఎన్టీఆర్ రహస్య స్థావరాన్ని సూచించే భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. వైఆర్ఎఫ్ స్టూడియోస్‌లో చాలా క్లోజప్ - వీఎఫ్ఎక్స్ -హెవీ షాట్‌లు ఉంటాయి. దివంగత రజత్ పొద్దార్ చాలా సెట్లను రూపొందించారు. క్లైమాక్స్ చిత్రీకరణ మాత్రమే ఇక మిగిలి ఉంది. నిర్మాత ఆదిత్య చోప్రా, అయాన్‌తో కలిసి సెట్ డిజైన్ ఎగ్జిక్యూషన్‌తో పాటు యాక్షన్‌ను పరిశీలిస్తున్నారు.
వండర్ ఉమన్ (2017) ఫేమ్ స్టీవ్ బ్రౌన్, వారియర్ నన్ (2020) చిత్రాలకు పనిచేసిన మిగ్యుల్ జుజ్‌గాడో , ఫ్రాంజ్ స్పిల్‌హాస్ సహా 11 మంది స్టంట్ కోఆర్డినేటర్‌లను ఎంపిక చేసుకున్నారు. వార్ 2 భారీ పోరాటాల చిత్రీకరణ కోసం ముగ్గురు యాక్షన్ డైరెక్టర్లను ఫైనల్ చేసారు. గతంలో వెనమ్ 2018, ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ -2017 లకు పని చేసిన సె-యోంగ్ ఓహ్ ఆఫ్,.. ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ -2015, స్నోపియర్సర్ -2013 చిత్రాలకు పనిచేసిన అమెరికన్ స్టంట్ కోఆర్డినేటర్ స్పిరో రజాటోస్‌ను దీని కోసం ఎంచుకున్నారు. జవాన్ -2023 , పఠాన్ -2023 చిత్రాల కోసం చేసిన పనిని చూసి ముగ్ధులైన మేకర్స్ వెంటనే టర్ఫ్, సునీల్ రోడ్రిగ్స్‌ని తో ఒప్పందం చేసుకున్నారు. ఈ
ముగ్గురూ కలిసి వార్ 2 కోసం ఒక విభిన్నమైన పోరాటాల సీక్వెన్సును రూపొందించారు. ఇందులో భీకరంగా భల్లూక పోరాటాలు హ్యాండ్ టు హ్యాండ్ కిక్ ఫైట్స్ ఉంటాయి. డిసెంబర్ లో వార్ 2 టాకీ భాగాల చివరి షెడ్యూల్ పూర్తి చేస్తారు.