Begin typing your search above and press return to search.

వార్2కు వాయిదా త‌ప్ప‌దా?

య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ లో రూపొందుతున్న వార్2 ను ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 12:30 AM GMT
వార్2కు వాయిదా త‌ప్ప‌దా?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్ తో క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో వార్2పై మంచి అంచ‌నాలున్నాయి. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ లో రూపొందుతున్న వార్2 ను ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు.

అయితే బాలీవుడ్ మీడియా వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వార్2 ముందు చెప్పిన డేట్ కు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం ఇంకా షూటింగ్ చాలా వ‌ర‌కు పెండింగ్ ఉండ‌ట‌మే అంటున్నారు. రిలీజ్ కు ఇంకా ఐదు నెల‌ల టైమ్ ఉన్న‌ప్ప‌టికీ, అవుట్‌డోర్ షెడ్యూల్ ఇంకా చాలా ఉందట‌. దాన్ని పూర్తి చేయ‌డంతో పాటూ కొన్ని సీన్స్ ను విదేశాల్లో షూట్ చేయాల్సి ఉంద‌ట‌.

వీట‌న్నింటికీ చాలానే టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి వార్2 ను వాయిదా వేయాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్. ఈ విష‌యంలో ఇంకా ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ వార్2 పోస్ట్ పోన్ విష‌యం మాత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఒక‌వేళ వార్2 నిజంగా వాయిదా ప‌డితే ఆ డేట్ ను వాడుకోవడానికి ప‌లు సినిమాలు రెడీగా ఉన్నాయి.

ఆమీర్ ఖాన్ సొంత బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న లాహోర్ 1947ని అదే డేట్ కు తీసుకురావాల‌ని చూస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వీలైనంత త్వ‌ర‌గా వార్2 షూటింగ్ ను ఫినిష్ చేసుకుని ఫ్రీ అయిపోవాల‌ని చూస్తున్నాడు. మార్చి నుంచి నీల్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్న తార‌క్, ఆ సినిమా త‌ర్వాత దేవ‌ర2ను చేయ‌నున్నాడు.