Begin typing your search above and press return to search.

వార్ 2 కన్ఫ్యూజన్.. మ్యాటరెంటీ?

తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   7 March 2025 12:37 PM IST
వార్ 2 కన్ఫ్యూజన్.. మ్యాటరెంటీ?
X

యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న వార్ 2 సినిమాపై ఊహాగానాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, యాష్ రాజ్ స్పై యూనివర్స్‌లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌. కానీ సినిమా స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా సరైన అప్‌డేట్స్ లేకపోవడంతో సినిమా తాలూకు అంచనాలు కాస్త కన్ఫ్యూజింగ్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంత సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయానికి ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా కొన్ని కీలక సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఫలితంగా, సినిమా టేకింగ్‌లో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో, ముఖ్యమైన సన్నివేశాలను మళ్లీ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ఇప్పటికే హృతిక్‌తో కలిసి ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. కానీ తాజాగా, కొన్ని రీషూట్స్ కారణంగా ఆయన డేట్స్‌ను మరింత పొడిగించాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనికి పూర్తి భిన్నంగా మరొక సమాచారం వెలుగు చూస్తోంది. నిజానికి ఆదిత్య చోప్రా అయాన్ ముఖర్జీ పనితీరుపై పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని, ఈయన దర్శకత్వంలో పఠాన్ 2 ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు ఉన్నాయి.

అంటే, వార్ ప్రస్తుతం ఓ స్ట్రాంగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుండటమే కాకుండా, హాలీవుడ్ స్థాయిలో విజువల్స్‌తో రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కానీ రెండు వేరే వేరే కథనాలు రావడంతో అసలు సినిమా మేకింగ్ ఎలా సాగుతోందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టి ఉన్నాడు. ‘దేవర’ పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వార్ 2 టీంకు డేట్స్ ఇచ్చారు. అయితే, అనుకున్న షెడ్యూల్ కంటే ఈ ప్రాజెక్ట్ మరింత సుదీర్ఘంగా మారుతుండటంతో, ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్టులు దెబ్బతినే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా కొరటాల శివ ‘దేవర 2’కు సంబంధించి ఎన్టీఆర్ డేట్స్ ఆలస్యం కావొచ్చన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే WAR 2 ఆలస్యమైతే సినిమా బడ్జెట్ పెరిగే అవకాశముంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూట్‌కి ఇది కీలకమైన సినిమా కాబట్టి, సక్సెస్ అయితే పాన్ ఇండియా మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. కానీ సినిమా వాయిదా పడితే పబ్లిసిటీ దెబ్బతినే ప్రమాదముంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు అనుకున్న టైమ్‌కి రావడం కష్టంగా మారుతోంది. WAR 2 ఆగస్ట్ 14న విడుదల అవుతుందా? లేదా వాయిదా పడుతుందా? అనేది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.