Begin typing your search above and press return to search.

వార్ 2కు పెద్ద చిక్కొచ్చి పడిందే!

ఏక్ ది టైగర్ సినిమాతో యష్ రాజ్ లో స్పై థ్రిల్లర్ సినిమాల జర్నీ మొదలైంది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 4:21 AM GMT
వార్ 2కు పెద్ద చిక్కొచ్చి పడిందే!
X

యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ వరుస పెట్టి చేస్తోంది. ఒక యూనివర్స్ లా క్రియేట్ చేసి ఈ సినిమాలు అన్నింటిని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏక్ ది టైగర్ సినిమాతో యష్ రాజ్ లో స్పై థ్రిల్లర్ సినిమాల జర్నీ మొదలైంది. ఆ సినిమా హిట్ తర్వాత టైగర్ జిందా హై, వార్, పఠాన్ మూవీస్ వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఈ సినిమాలు అన్ని నిర్మాత ఆదిత్య చోప్రాకి సాలిడ్ కలెక్షన్స్ తీసుకొచ్చాయి. అయితే టైగర్ 3 మాత్రం ఒక్కసారిగా యష్ రాజ్ ఫిలిమ్స్ అంచనాలు అన్ని తలక్రిందులు చేసింది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య టైగర్ 3 మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తాయని భావించారు. అయితే టైగర్ 3 మొదటి రోజే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. స్పై థ్రిల్లర్ సిరీస్ ల కొనసాగింపుకి బ్రేక్ డౌన్ లా టైగర్ 3 మారింది.

మెప్పించలేని కథ, కథనాల కారణంగా ఆడియన్స్ టైగర్ 3 సినిమాని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ స్పై థ్రిల్లర్స్ అన్ని ఒకే తరహా కథతో ఒకే టైపు యాక్షన్ సీక్వెన్స్ తో రావడం కూడా ఫెయిల్యూర్ కి ఒక కారణం అని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 460 నుంచి 470 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయొచ్చని భావిస్తున్నారు.

ఇప్పుడు టైగర్ 3 ఎఫెక్ట్ వార్2 మీద పడింది. ఈ సినిమా కూడా కథ, కథనాలు మరోసారి చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే టైగర్ 3 ఎఫ్గేక్ట్ కారణంగా పఠాన్ వెర్సస్ టైగర్ సినిమాని 2025కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకున్నారు.

ఇప్పుడు మాత్రం వార్ 2 రిజల్ట్ బట్టి ఆ సినిమా చేయాలా లేదా అనేది నిర్మాత ఆదిత్య చోప్రా డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టైగర్ 3 చూసిన తర్వాత ఆడియన్స్ కూడా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ లు వదిలేయాలని, అనవసరమైన లింక్ లు పెట్టకుండా కొత్త కథలు చెప్పే ప్రయత్నం చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారంట.