Begin typing your search above and press return to search.

ఆయన వార్‌ మార్చిలో.. ఎన్టీఆర్‌ వార్‌ ఏప్రిల్‌ లో..!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌ మరియు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి వార్‌ 2 సినిమాలో నటించబోతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   5 March 2024 9:37 AM GMT
ఆయన వార్‌ మార్చిలో.. ఎన్టీఆర్‌ వార్‌ ఏప్రిల్‌ లో..!
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌ మరియు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి వార్‌ 2 సినిమాలో నటించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ నెల నుంచే సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను రూపొందించబోతున్నాడు.

జాతీయ మీడియా కథనాల అనుసారం ఈనెల 7న జపాన్‌ లోని షావోలిన్ టెంపుల్‌ వద్ద హృతిక్‌ రోషన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు. ఈనెలలోనే హృతిక్‌ రోషన్ వార్‌ మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఎన్టీఆర్‌ వార్‌ ను మొదలు పెట్టడానికి నెల సమయం కావాల్సి ఉంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ ఏప్రిల్‌ రెండో వారం లో జాయిన్‌ అవ్వబోతున్నాడు. అప్పటి వరకు దేవర సినిమా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటాడు. ఎన్టీఆర్‌ వచ్చే వరకు హృతిక్‌ రోషన్ పై సోలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారు.

ఎన్టీఆర్‌ కి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌ లో మంచి ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయ్యింది. ఆ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా వార్ 2 లో ఆయన పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా వార్‌ 2 ఉంటుందని అంటున్నారు.

మొదటి సారి ఎన్టీఆర్‌ హిందీ సినిమా చేస్తున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ముందు బాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ మరిన్ని సినిమాలు చేసే విధంగా వార్‌ 2 హిట్‌ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.