Begin typing your search above and press return to search.

'వార్​ 2'.. షూటింగ్ దశలోనే ట్రోలింగా?

యంగ్ టైగర్​ ఎన్టీఆర్, బాలీవుడ్​ స్టార్​ హృతిక్ రోషన్ కలిసి నటించబోతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బ్రహ్మాస్త్ర ఫేమ్​ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Oct 2023 5:55 AM GMT
వార్​ 2.. షూటింగ్ దశలోనే ట్రోలింగా?
X

యంగ్ టైగర్​ ఎన్టీఆర్, బాలీవుడ్​ స్టార్​ హృతిక్ రోషన్ కలిసి నటించబోతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బ్రహ్మాస్త్ర ఫేమ్​ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. గత రెండు వారాల నుంచి స్పెయిన్​లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. ఓ సూపర్ ఛేజింగ్ సీక్వెన్స్​ను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

అయితే ఇదే సమయంలో ఈ సీక్వెన్స్​ ట్రోల్స్​కు కూడా గురైంది. ఎందుకంటే ఈ సీక్వెన్స్​ను ఎన్టీఆర్​-హృతిక్​ డూప్​లతో తెరకెక్కించారు. ఇలా డూప్​లతో యాక్షన్ సీక్వెన్స్​ను షూట్​ చేయడాన్ని కొంతమంది నెటిజన్లు.. అయాన్ డెసిషన్​ను తప్పుబడుతూ హృతిక్​-తారక్ నటన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

హై బడ్జెట్​ సినిమాలను తెరకెక్కించడమంటే కష్టంతో కూడుకున్న పని. పైగా ఇలాంటి భారీ ఛేజింగ్​ సీన్స్​లో డూప్​లతోనే తెరెక్కించడం, వీఎఫ్​ఎక్స్​ వాడటం సర్వసాధారణం. హాలీవుడ్ అవెంజర్స్ లాంటి సూపర్ హీరో ఫిల్మ్​ కూడా ఇలానే తీస్తారు. కాబట్టి ఇలా ప్రశ్నించడం, ట్రోల్​ చేయడంలో ఎటువంటి అర్థం లేదనే చెప్పాలి.

అయినా ఈ ట్రోల్స్​.. ఇతర స్టార్ హీరోల అభిమానులు చేసి ఉండొచ్చు. ఎందుకంటే తమ ఫేవరెట్​ హీరోలు ఎన్టీఆర్​- హృతిక్ నటిస్తున్న హై బడ్జెట్​ లాంటి సినిమాల్లో భాగం కాకపోవడంతో కూడా ఇలా చేసి ఉంటారు! ఇకపోతే మీడియా ఔట్​ లెట్స్​ కూడా ఈ మధ్య ఫిల్మ్​ మేకింగ్స్ సీక్రెట్స్​ను బయటపెట్టేస్తున్నారు. దీంతో భారీ విజువల్స్​, హీరోలు చేసే విన్యాసాల వెనక ఉన్న మ్యాజిక్ సీక్రెట్​ తెలిసిపోయి ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా ఔట్​ లెట్స్​ కూడా కాస్త ఆలోచించి వ్యవహరించాలి.

కాగా ఈ మూవీ హీరోయిన్​గా కియారా అద్వానీ నటించబోతున్నట్లు తెలిసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్​లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో.. ముఖ్యంగా తారక్​కు ఎంత వరకు ఉపయోగపడుతుందో..