హృతిక్ (X) ఎన్టీఆర్: ఫేసాఫ్‌కి ముందే
అయితే ఈ షెడ్యూల్ లో ఇద్దరు ప్రధాన నటులు లేకుండానే చిత్రీకరణ పూర్తి చేసారని తెలిసింది. హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఫైటర్', 'దేవర' షూటింగ్ లతో బిజీ.
By: Tupaki Desk | 26 Oct 2023 11:30 PM GMT2023-24 సీజన్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం 'వార్ 2' ప్రస్తుతం సెట్స్‌లో ఉంది. ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర', 'యే జవానీ హై దీవానీ' చిత్రాల ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన దశ నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో భీకరమైన యాక్షన్ బ్లాక్ లను మించి, మరో హైలైట్ కచ్చితంగా సినిమాలోని ప్రధాన తారాగణం. హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ కలయిక ఉత్కంఠ పెంచుతోంది. ఒక హిందీ అగ్ర హీరో, ఒక టాలీవుడ్ అగ్రహీరో కలయిక నిజంగా అరుదైనది. ఆస్కార్ మూవీలో నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉరకలెత్తే ఉత్సాహంతో హృతిక్ ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్దరూ మొదటిసారిగా తెరపై ఒకరినొకరు ఎదుర్కొంటారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి తాపీగా పూర్తవుతోంది. గత రెండు వారాల నుండి ఆయాన్ ముఖర్జీ బృందం షూటింగ్ స్పెయిన్‌లో పూర్తి చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు టీమ్ మొదటి షెడ్యూల్‌ను ముగించింది.
అయితే ఈ షెడ్యూల్ లో ఇద్దరు ప్రధాన నటులు లేకుండానే చిత్రీకరణ పూర్తి చేసారని తెలిసింది. హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఫైటర్', 'దేవర' షూటింగ్ లతో బిజీ. వారిలో ఒకరు ముంబైలో, మరొకరు హైదరాబాద్‌లో ఉన్నారు. వార్ -2 చిత్రీకరణలో ఎవరూ పాల్గొనలేదు. నిజానికి ఇది ఫీచర్ ఫిల్మ్‌ల షూటింగ్‌లో కొత్త టెక్నిక్. నేటి కాలంలో చాలా చిత్రాల యాక్షన్ బ్లాక్‌లు ప్రధాన నటుల ప్రమేయం లేకుండానే చిత్రీకరిస్తున్నారు. అయితే వారి శరీరం, ముఖాలు బాడీ స్వాప్ టెక్నాలజీని ఉపయోగించి డబుల్ రీప్లేస్ చేయడం అద్బుతమైన టెక్నిక్ అని చెబుతున్నారు. అదే విధానాన్ని పఠాన్ కోసం దుబాయ్ -రష్యాలో చిత్రీకరించిన యాక్షన్ బ్లాక్‌లకు ఉపయోగించారు. హృతిక్ -ఎన్టీఆర్ జూనియర్ డిసెంబర్‌లో మాత్రమే 'వార్ 2' షూటింగ్ ని ప్రారంభిస్తారని సోర్స్ చెబుతోంది.
స్పెయిన్ షెడ్యూల్ సుమారు 12 రోజుల పాటు జరిగింది. బాడీ డబుల్ కోసం అయాన్ ముఖర్జీ సరైన ఫిట్-డూప్‌ని ఉపయోగించాడు. హృతిక్ - ఎన్టీఆర్ జూనియర్ కోసం 50 మందికి పైగా ప్రతిభావంతులైన స్టంట్ ఆర్టిస్టుల డూప్ లను ఆడిషన్ చేసాడు. ఈ స్టంట్ డబుల్ హృతిక్ - ఎన్టీఆర్ జూనియర్‌లతో కలిసి స్పెయిన్‌కు వెళ్లే ముందు ముంబై - హైదరాబాద్‌లలో పలు టెస్ట్ షూట్‌లను పూర్తి చేసారు'' అని ఒక సోర్స్ ద్వారా తెలిసింది.
అయితే వార్ 2 చిత్రీకరణ ఎప్పటికి పూర్తవుతుంది? అనే ప్రశ్నకు.. ఇంతకుముందు రణబీర్ కపూర్ జూమ్ ఇంటరాక్షన్‌లో కొన్ని సీక్రెట్స్ ని ఓపెన్ చేసాడు. అయాన్ ముఖర్జీ 2024 మధ్య నాటికి 'వార్ 2' షూట్‌ను ముగించాలని యోచిస్తున్నారని, ఆపై 'బ్రహ్మాస్త్ర 2'ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ''కాబట్టి బ్రహ్మాస్త్ర 2 రాయడం చాల సంక్లిష్టం. మేము దాని కోసం అన్ని కాలాదుల్లో రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నాం. గత వారమే అయాన్ నాకు స్క్రిప్టు మొత్తం వివరించాడు. పార్ట్ 1 అతడి ఆలోచన, ఆ ఆలోచన, పాత్రల కంటే అయాన్ రెండో భాగాన్ని పది రెట్లు పెద్దదిగా మలుస్తున్నాడు. అతడు ప్రస్తుతం వార్ 2 కోసం పని చేస్తున్నాడు కాబట్టి వచ్చే ఏడాది మధ్యలో వార్ 2ని పూర్తి చేయాలనేది ప్లాన్. మేము ఆశాజనకంగా వచ్చే ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభిస్తాము. కానీ కచ్చితంగా చాలా పని ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రచనా కార్యక్రమాలు జరుగుతున్నాయి'' అని తెలిపారు.
అయాన్ ముఖర్జీ వార్ 2లో హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఫేసాఫ్ సన్నివేశాల్ని కూడా చిత్రీకరించాల్సి ఉంది. తదుపరి భారీ షెడ్యూల్ లో ప్రధాన నటుల మధ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ చిత్రం డైలాగ్స్ తో కూడుకున్న సన్నివేశాల చిత్రీకరణకు వెళ్లే ముందు, మరొక యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ కూడా నటిస్తోంది. అయితే కియారా ఆరంగేట్రంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రం 2025 రిపబ్లిక్ డే వారాంతంలో విడుదల కానుంది.