3ని.ల అతిథి పాత్ర కోసం వార్నర్ పారితోషికం?
యూత్ స్టార్ నితిన్- శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ లో వార్నర్ అతిథి పాత్రలో నటించారు.
By: Tupaki Desk | 26 March 2025 5:00 PMతెలుగు సినిమాలను ఫాలో చేసే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి తెలుగు రాష్ట్రాలు సహా భారతదేశంలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల నుండి ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్ తో అతడు భారీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అతడు ఇప్పుడు `రాబిన్‌హుడ్` అనే తెలుగు చిత్రంలో అతిధి పాత్రలో నటిస్తున్నాడు. యూత్ స్టార్ నితిన్- శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ లో వార్నర్ అతిథి పాత్రలో నటించారు.
కేవలం 3-5 నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్రలో అతడు కనిపిస్తాడు. అయితే ఈ పాత్రలో నటించినందుకు వార్నర్ రూ. 2.5 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. అదనంగా అతడి ప్రమోషన్స్ కోసం మరో 1కోటి ఖర్చు చేయనున్నారట. ఆసక్తికరంగా గత సంవత్సరం ఐపిఎల్ సమయంలో అతడు తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసాడు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం రెండు రోజులు షూటింగ్ చేశాడని కూడా కథనాలొచ్చాయి.
ఇటీవల ఈ రాబరీ యాక్షన్ కామెడీ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వార్నర్ హాజరయ్యాడు. ఈ వేదికపై వార్నర్ గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్య కాస్త ఘాటుగా హాస్యాస్పదంగా ఉండటంతో ఆన్‌లైన్‌లో విమర్శలు వచ్చాయి. అయితే దర్శకుడు వెంకీ కుడుముల అది ఒక జోక్ అని స్పష్టం చేశారు. చివరికి రాజేంద్ర ప్రసాద్ సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. ``క్రికెట్‌లో స్లెడ్జింగ్ చూశాను - ఇది సరదాగా అనిపించింది`` అని వార్నర్ నిశ్చేష్టుడై అన్నాడు. ప్రీరిలీజ్ వేదికపై తన ఫాలోవర్స్ కి వార్నర్ కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ నుండి నటనకు మారడం అంటే భయపడినా కానీ, ఈ చిత్రంలో భాగం కావడం తనకు గౌరవంగా అనిపించిందని అన్నారు. కథానుసారం.. రామ్ (నితిన్) నీరా (శ్రీలీల) కోసం దొంగగా మారిన మాస్టర్ బాడీగార్డ్ కథేమిటో తెరపై చూడాలి. షైన్ టామ్ చాకో, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. వార్నర్ అతిధి పాత్రలలో కనిపిస్తారు. ఆదివారం హైదరాబాద్‌లో తన తొలి తెలుగు చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ (2021)లోని హిట్ పాట శ్రీవల్లికి.. ఐకానిక్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేసాడు. మూడు నిమిషాల పాత్ర కోసం ఏకంగా 3 కోట్లు లాగేస్తున్నాడంటే అందరూ నోరెళ్లబెడుతున్నారు. కానీ వార్నర్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇది న్యాయబద్ధమైనది అని కూడా అభిమానులు సమర్థిస్తున్నారు.