165 కోట్ల విలువైన పీసీ ఇంట్లో వాటర్ లీకేజ్!
దీంతో నష్టపరిహారం కోరూతూ ఆ ఇల్లు అమ్మిన వ్యక్తిపై దంపతులు ఇద్దరు కోర్టులో దావా వేసారని సమాచారం.
By: Tupaki Desk | 2 Feb 2024 6:30 AM GMTప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ వివాహం అనంతరం లాస్ ఏంజెల్స్ లో ఇద్దరు కొత్త కాపురం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. 20 మిలియన్ డాలర్లతో విలాసవంతమైన భవనాన్ని ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసి కాపురం మొదలు పెట్టారు. తమ ఇద్దరి అభిరుచులకు తగ్గట్టు ఆ ఇంటిని రెన్నోవేషన్ చేసి ఎంతో అందంగానూ డెకరేట్ చేసుకున్నారు. దంపతులు ఇద్దరు ఆ ఇంటిలో చిలకాగోరింకల్లా ఉన్న ఫోటోల్ని సైతం ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
తాజాగా ఈ జోడీ ఇప్పుడా ఇంటి నుంచి నిర్దాక్షణ్యంగా బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఇంట్లో నీళ్లు లీక్ అవ్వడంతో చాలా ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయట. దీంతో నష్టపరిహారం కోరూతూ ఆ ఇల్లు అమ్మిన వ్యక్తిపై దంపతులు ఇద్దరు కోర్టులో దావా వేసారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ధరల ప్రకారం ఆ ఇంటి విలువ సుమారు 165 కోట్లు ఉంటుందని సమాచారం.
మరమ్మత్తులు కోసమే 2.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసారుట. మొత్తానికి పీసీ ఇష్టపడి కొనుక్కున ఇల్లు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం సంచలనం మారుతుంది. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే మొత్తం ఏడు పడక గదులు..తొమ్మిది బాత్ రూమ్ లు.. టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్.. చెఫ్ కిచెన్.. హోమ్ థియేటర్.. స్పా..స్టీమ్ షవర్.. జిమ్.. బిలియర్స్డ్ రూమ్..స్విమ్మింగ్ పూల్ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.
రోజంతా ఎంత పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చినా..ఆ ఇల్లు చూసే సరికి అన్ని మర్చిపోయేలా ఉండాలని అన్ని కోట్లు పోసి కొంటే? వాటర్ లీకేజ్ అవ్వడం అంటే అన్యాయమే కదా. ఈ విషయంలో పీసీకి అమెరికా లో ఉన్న భారతీయులంతా సహకరించాల్సిందే.