WCC సినిమా ప్రవర్తనా నియమావళి రూల్ బుక్
ఫేస్‌బుక్ పోస్ట్‌లో సినిమా ప్రవర్తనా నియమావళిని అనుసరించడానికి పరిశ్రమ సభ్యులందరూ బహిరంగ సంఘీభావం, స్ఫూర్తితో వస్తారని WCC ఆశాభావం వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 8 Sep 2024 8:30 PM GMTమలయాళ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళా నిపుణులతో కూడిన 'విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' (WCC) పరిశ్రమను సమానమైన సురక్షితమైన కార్యస్థలంగా పునర్నిర్మించడానికి త్వరలో సిఫార్సుల సమితి(పాయింట్ల)ని అందజేస్తామని శనివారం తెలిపింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో సినిమా ప్రవర్తనా నియమావళిని అనుసరించడానికి పరిశ్రమ సభ్యులందరూ బహిరంగ సంఘీభావం, స్ఫూర్తితో వస్తారని WCC ఆశాభావం వ్యక్తం చేసింది.
మాలీవుడ్ వేధింపులపై జస్టిస్ కె హేమ కమిటీ నివేదికను ప్రచురించిన నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా, తన ప్రతిపాదిత సిఫార్సులతో సిరీస్(పుస్తకం, వీడియోలు)ను ప్రారంభిస్తామని కలెక్టివ్ టీమ్ తెలిపింది. మలయాళ చిత్ర పరిశ్రమను అందరికీ సమానమైన, సురక్షితమైన కార్యస్థలంగా పునర్నిర్మించడానికి మేం మా ప్రతిపాదిత సిఫార్సులతో ఈ రోజు సిరీస్‌ను ప్రారంభిస్తున్నాం. మన చలనచిత్ర పరిశ్రమ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌ను మరింత మెరుగ్గా మార్చడంలో సహాయపడే `సినిమా ప్రవర్తనా నియమావళి`ని అవలంబించడానికి పరిశ్రమ సభ్యులందరూ బహిరంగ సంఘీభావం, స్ఫూర్తితో కలిసి వస్తారని మేము ఆశిస్తున్నాము అని ఎఫ్.బి పోస్ట్ పేర్కొంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దురుసు ప్రవర్తనలను వెలుగులోకి తెచ్చిన జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక వెలువడిన వారాల తర్వాత కలెక్టివ్ టీమ్ కొత్త చర్యను చేపట్టింది. 2017లో నటిపై దాడి కేసు మలయాళ సినీ పరిశ్రమలో వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఉదంతాలను వెల్లడించిన నివేదిక తర్వాత కేరళ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పలువురు నటులు, దర్శకులపై లైంగిక వేధింపులు దోపిడీ ఆరోపణల నేపథ్యంలో వారిని విచారించడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆగస్టు 25న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.