Begin typing your search above and press return to search.

సత్తా చాటారు ఛాన్స్ అందుకున్నారు..!

టాలెంట్ ఉన్న వారికి ఇప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   20 July 2024 1:30 PM GMT
సత్తా చాటారు ఛాన్స్ అందుకున్నారు..!
X

టాలెంట్ ఉన్న వారికి ఇప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది. ఇదివరకు చేస్తే సినిమాలే చేయాలి అప్పుడే తమకు గుర్తింపు వస్తుందని అనుకునే వారు. కానీ ఈమధ్య వెబ్ సీరీస్ లతో కూడా అదరగొడుతున్న వారు ఉన్నారు. ప్రేక్షకులకు తమ స్టోరీ టెల్లింగ్ చెప్పేందుకు డిజిటల్ రంగాన్ని కూడా సరైన వేదికగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందు ఇక్కడ సత్తా చాటి ఆ క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకుంటున్నారు. ఈమధ్య ఇలా వెబ్ సీరీస్ లతో మెప్పించి స్టార్ ఛాన్సులు అందుకున్న వారు చాలామంది ఉన్నారు.

అందులో మొదటిగా చెప్పుకుంటే ఆల్ఫా డైరెక్టర్ శివ్ రావేల్ గురించి చెప్పుకోవాలి. ది రైల్వే మ్యాన్ అనే వెబ్ సీరీస్ తో డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించాడు శివ్ రావేల్. అంతకుముందు ధూమ్ 3 కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. రైల్వే మ్యాన్ చూసి యష్ రాజ్ ఫిలింస్ వారు ఆల్ఫా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆల్ఫా కథ విషయానికి వస్తే లేడీ స్పై కాన్సెప్ట్ తో అలియా భట్, శార్వరీ వాఘ్ లతో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. సినిమాపై స్టార్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇలానే మరో వెబ్ సీరీస్ డైరెక్టర్ ఈసారి వెండితెర మీద తన ప్రతిభ చాటాలని చూస్తున్నాడు. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రఘు తాత సినిమాను డైరెక్ట్ చేశారు సుమన్ కుమార్. తన విలేజ్ కోసం మహిళ చేసే ఫైట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుంది. సుమన్ కుమార్ కూడా ఫర్జి, ఫ్యామిలీ మ్యాన్, గన్స్ అండ్ గులాబ్స్ సినిమాకు రైటర్ గా పనిచేశారు. రఘు తాత ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశాయి.

ఇదే క్రమంలో యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి కల్లూరి సలాయ్, తిరువల్లూవర్ సర్వీసెస్ వెబ్ సీరీస్ లను డైరెక్ట్ చేసిన డ్యూడ్ విక్కీ కి కూడా సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. నయనతార లీడ్ రోల్ లో డ్యూడ్ విక్కీ డైరెక్షన్ లో మన్నన్ గట్టి 1960 సినిమా వస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. సౌత్ లో అదరగొడుతూ జవాన్ తో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అందుకున్న నయనతార ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తుంది.

ఇక సీనియర్ భామ కాజోల్, కృతి సనన్ ఇంపార్టెంట్ రోల్స్ లో వస్తున్న సినిమా దో పత్తి.. ఈ సినిమాను శశాంక్ చతుర్వేది డైరెక్ట్ చేస్తున్నారు. ఆయనకు ఇదే తొలి సినిమా. ఐతే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. దిల్ వాలే తర్వాత కాజోల్, కృతి సనన్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇలా కొత్త దర్శకులు అయినా కూడా ఇదివరకు వారు చేసిన వర్క్ నచ్చి భామలంతా కూడా ఛాన్సులు ఇస్తున్నారు. అయితే ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటే డైరెక్టర్ గా వెండితెర మీద కూడా వారు కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.