వెబ్ సీరీస్ సీక్వెల్.. మేకర్స్ మిస్ అవుతున్న లాజిక్..!
ఒక వెబ్ సీరీస్ సీజన్ సక్సెస్ అయ్యింది అంటే ఆ బజ్ లోనే సెకండ్ సీజన్ కూడా రిలీజ్ చేస్తే అదే జోరులో హిట్ అవుతుంది.
By: Tupaki Desk | 2 March 2024 6:10 AM GMTసినిమాలు ఎలాగైతే సీక్వెల్ పేరుతో మొదటి భాగం రెండో భాగం అంటూ రిలీజ్ అవుతున్నాయో.. వెబ్ సీరీస్ లు కూడా అదే తరహాలో సీజన్ 1, సీజన్ 2 అంటూ వస్తున్నాయి. అయితే వీటికి సినిమాలకు తీసుకున్నట్టుగా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. సినిమాల విషయంలో అంటే కోట్ల కొద్దీ బడ్జెట్ పెడతారు కాబట్టి ఆ వెయిటింగ్ తప్పనిసరి. కానీ వెబ్ సీరీస్ లు సీజన్ సీజన్ కు మధ్య గ్యాప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఒక వెబ్ సీరీస్ సీజన్ సక్సెస్ అయ్యింది అంటే ఆ బజ్ లోనే సెకండ్ సీజన్ కూడా రిలీజ్ చేస్తే అదే జోరులో హిట్ అవుతుంది. కానీ ఈమధ్య వెబ్ సీరీస్ లు సీజన్ 1 హిట్ అయినా కూడా సీజన్ 2 కోసం చాలా టైం తీసుకుంటున్నారు. ముఖ్యంగా డిస్నీ హాట్ స్టార్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సీరీస్ లలో ఒకటైన సేవ్ ది టైగర్స్ సీజన్ 1 మంచి సక్సెస్ అందుకోగా సీజన్ 2 కోసం ఆడియన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. సేవ్ ది టైగర్స్ వెబ్ సీరీస్ సీజన్ 1 2023 ఏప్రిల్ చివర్లో రిలీజైంది.
డిస్నీ హాట్ స్టార్ లో సక్సెస్ ఫుల్ వెబ్ సీరీస్ లో ఒకటిగా సేవ్ ది టైగర్స్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సీజన్ 1 రిలీజైన ఇన్నాళ్లకు మళ్లీ సీజన్ 2 అప్డేట్ వచ్చింది. అంటే దాదాపు ఏడాది తర్వాత సీజన్ 2 ని రిలీజ్ చేస్తున్నారు. సీజన్ 1 ఒక కిడ్నాప్ ట్విస్ట్ తో ముగించగా సీజన్ 2 లో దానికి కొనసాగింపు ఉంటుంది. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన ఇలాంటి వెబ్ సీరీస్ లు ఇలా ఏడాది తర్వాత సెకండ్ సీజన్ వదలడం వల్ల ఆ సీజన్ చూసిన వారు కూడా సెకండ్ సీజన్ పై ఉన్న ఆసక్తి కోల్పోతారని చెప్పొచ్చు.
సేవ్ ది టైగర్స్ మాత్రమే కాదు జేడీ చక్రవర్తి తో చేసిన దయ వెబ్ సీరీస్ కూడా సీజన్ 1 మంచి సక్సెస్ అందుకుంది. ఆ సీరీస్ సీజన్ 2 సంగతి కూడా మర్చిపోయారు మేకర్స్. మరి సీజన్ 1 కి సీజన్ 2 కి ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల వారికి వచ్చే లాభం ఏమో కానీ నష్టం మాత్రం చాలా ఉంటుందని చెప్పొచ్చు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కి ఆడియన్స్ ని ప్రిపేర్ చేసే క్రమంలో సీజన్ 1 ని ఈ 10 రోజులు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది డిస్నీ హాట్ స్టార్. మరి సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఎలా ఉండబోతుందో చూడాలి. సేవ్ ది టైగర్స్ సీరీస్ కి మహి వి రాఘవ, ప్రదీప్ అధ్వైతం కథ అందించగా తేజ కాకుమాను డైరెక్ట్ చేశారు.