Begin typing your search above and press return to search.

కల్కిలో మరో కోలీవుడ్ యాక్టర్.. నాగి ప్లాన్ అలా ఉంది మరి!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

By:  Tupaki Desk   |   22 Jun 2024 5:00 PM GMT
కల్కిలో మరో కోలీవుడ్ యాక్టర్.. నాగి ప్లాన్ అలా ఉంది మరి!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ.600 కోట్లకుపైగా భారీ బ‌డ్జెట్‌ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.


రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ కల్కి మేకర్స్.. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తున్నారు. అందుకు గాను రీసెంట్ గా జర్నీ ఆఫ్ కల్కి పేరుతో ప్రీ లూడ్ వీడియోస్ ను రిలీజ్ చేశారు. అందులో నాగ్ అశ్విన్ వివరణకు అంతా ఫిదా అయిపోయారు. ఇక ఇటీవల వచ్చిన కొత్త ట్రైలర్ అయితే చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ లో సినిమాపై వేరే లెవల్ లో అంచనాలు పెంచేసింది.

అదే సమయంలో మేకర్స్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. గంటల గ్యాప్ లో సినిమాలోని క్యారెక్టర్స్ ను రివీల్ చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అనేకమంది కీలక పాత్రలు పోషిస్తుండగా.. తాజాగా కోలీవుడ్ సీనియర్ యాక్టర్ పశుపతి లుక్ ను రిలీజ్ చేశారు. వీరన్ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలిపారు. నాగి క్రియేట్ చేసిన శంభాలా ప్రపంచంలో రెబల్ గ్రూప్ లీడర్ గా పశుపతి ఉంటారని సమాచారం.

అయితే కోలీవుడ్ లో పశుపతి.. మంచి గుర్తింపు దక్కించుకున్న యాక్టర్. వరుస సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. సర్పత్త పరంబరై సినిమాతో సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు. పలు తమిళ సినిమాల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పశుపతి.. డైరెక్ట్ తెలుగు మూవీలో నటించడం ఇదే తొలిసారి. మొత్తానికి నాగ్ అశ్విన్ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు మేకర్స్ ఇచ్చిన అప్డేట్ల ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అన్నా బెన్, శోభన, మాళవిక నాయర్, శాశ్వత ఛటర్జీ నటిస్తున్నారు. ఇప్పుడు పశుపతి కూడా యాక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమాలో ఇంకెవరు ఉన్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.