Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ పెళ్లి.. మ్యాటరెంటంటే?

అయితే హీరోయిన్ రష్మికతో విజయ్ రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. పబ్లిక్ గా మాత్రం వీరిద్దరిలో ఒక్కరూ ఓపెన్ కాలేదు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 6:17 AM GMT
విజయ్ దేవరకొండ పెళ్లి.. మ్యాటరెంటంటే?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే హీరోయిన్ రష్మికతో విజయ్ రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. పబ్లిక్ గా మాత్రం వీరిద్దరిలో ఒక్కరూ ఓపెన్ కాలేదు.

కానీ రష్మిక.. విజయ్ ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటారు. ఫెస్టివల్స్ ను వారితోనే జరుపుకుంటూ ఉంటారు. పలుమార్లు విజయ్ తో బయట కనిపించారు. రీసెంట్ గా తాను నటించిన పుష్ప-2 మూవీ ప్రమోషన్స్ లో ఇండస్ట్రీకు చెందిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. అంతా మీకు తెలుసు కదా అని నవ్వారు.

ఇటీవల విజయ్ దేవరకొండ కూడా డేటింగ్ వార్తలపై రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు చెబుతానని వ్యాఖ్యానించారు. సెలబ్రిటీ అయినప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారని విజయ్ అభిప్రాయపడ్డారు.

దీంతో విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారని అంతా మరోసారి ఫిక్స్ అయిపోయారు. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని, 2025లో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని అనుకున్నారు. అలాంటి సమయంలో సడెన్ గా విజయ్ దేవరకొండ.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రీసెంట్ గా వైరల్ వీడియోను పోస్ట్ చేశారు.

అందులో 2025లో అయినా మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగితే.. సూపర్ స్టార్ రజనీ కాంత్ జస్ట్ నవ్వు నవ్వేసి ఊరుకుంటాడు. ఆ వీడియో ద్వారా విజయ్.. 2025లో తాను వివాహం చేసుకుంటానో లేదో కన్ఫర్మ్ లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక.. విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారి గీతా గోవిందం కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. మరోసారి డియర్ కామ్రేడ్ లో జతకట్టారు. ఆ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ.. వారి కెమిస్ట్రీకి అంతా ఫిదా అయిపోయారు. అలా విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్, ఆఫ్ స్కీన్ బాండింగ్ ను ఎంతో మంది ఇష్టపడుతున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారు.