దేవర రన్ టైమ్ ఎంతంటే?
అనిరుద్ రవిచందర్ అందిస్తోన్న మ్యూజిక్ దేవర సినిమాకి నెక్స్ట్ లెవల్ బూస్టింగ్ ఇవ్వబోతోందని సాంగ్స్ తోనే స్పష్టం అయ్యింది.
By: Tupaki Desk | 4 Sep 2024 4:46 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రీరిలీజ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అనిరుద్ రవిచందర్ అందిస్తోన్న మ్యూజిక్ దేవర సినిమాకి నెక్స్ట్ లెవల్ బూస్టింగ్ ఇవ్వబోతోందని సాంగ్స్ తోనే స్పష్టం అయ్యింది.
ఇప్పటి వరకు దేవర సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. సినిమాపై కూడా హైప్ క్రియేట్ చేశాయి. మూడో సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. హీరో, హీరోయిన్ మీద చిత్రీకరించిన డ్యూయెట్ ని థర్డ్ సింగిల్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా షురూ అయ్యాయి.
థర్డ్ సింగిల్ తర్వాత చిత్ర యూనిట్ మీడియా ముందుకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకొని కంటెంట్ ని జనాల్లోకి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కి దేవర సినిమా మరింత బూస్టింగ్ ఇవ్వాలంటే కచ్చితంగా స్ట్రాంగ్ ప్రమోషన్స్ ఉండాల్సిందే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. సినిమా నిడివి 2 గంటల 52 నిమిషాల నుంచి 3 గంటల 6 నిమిషాల మధ్యలో ఉంటుందంట. ఇప్పటికే కొరటాల మూవీ టైం డ్యూరిషన్ మీద వర్క్ చేస్తున్నారంట. వీలైనంత బెస్ట్ అవుట్ ఫుట్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. 350 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిసినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే 200-250 కోట్ల మధ్యలో సినిమా థీయాట్రికల్ బిజినెస్ ఉంటుందని అంచనా. ఎన్టీఆర్ ఇమేజ్ తో పోల్చుకుంటే ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. ఈ సినిమాతో కచ్చితంగా టాలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవాలని చిత్ర యూనిట్ బలంగా అనుకుంటుంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.