Begin typing your search above and press return to search.

పుష్ప 3 చాలా పెద్ద కథే..!

ఐతే వాస్తవంగా చెప్పాలంటే పుష్ప 3 చేయాలనే ఆలోచన సుకుమార్ కు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పుష్ప 3 కోసం కథ పరంగా పుష్ప 2 లో కొంత ఫిల్లింగ్ చేశాడని అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 3:00 AM GMT
పుష్ప 3 చాలా పెద్ద కథే..!
X

పుష్ప 1 ఇచ్చిన బూస్టింగ్ తో 3 ఏళ్లు టైం తీసుకుని పుష్ప 2 ని తెరకెక్కించిన డైరెక్టర్ సుకుమార్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ముందు నుంచి సినిమాపై బజ్ విపరీతంగా ఉండగా దానికి తోడు పాజిటివ్ టాక్ వచ్చేసరికి పుష్ప 2 కి పండగ అన్నట్టే ఉంది. ఐతే పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే పుష్ప 3 ఉంటుందని దానికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐతే వాస్తవంగా చెప్పాలంటే పుష్ప 3 చేయాలనే ఆలోచన సుకుమార్ కు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పుష్ప 3 కోసం కథ పరంగా పుష్ప 2 లో కొంత ఫిల్లింగ్ చేశాడని అనిపిస్తుంది.

పుష్ప 2 లో కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టాడు సుకుమార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు జాతర సీన్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో థియేటర్ లో వారు తీసిన క్లిప్స్ కూడా వైరల్ చేస్తున్నారు. ఐతే పుష్ప 3 కథ ఏమై ఉంటుందా అన్నది ఆలోచిస్తే.. పుష్ప 2 ఎండింగ్ లో ఢిల్లీ మంత్రితో కయ్యం పెట్టుకున్న పుష్ప రాజ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాడని అర్థమవుతుంది.

ఫ్యామిలీ మొత్తం కోల్పోయిన పుష్ప రాజ్ అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత అతని కోసం ప్రజలు ఆందోళ చెందుతారు. అడవిలో పుష్ప రాజ్ ఛాయలు తెలియడం చూసి పోలీసులు అక్కడ పహారా వేస్తారు. ఐతే పుష్ప 2 లో ఎస్పీ ఎపిసోడ్ ముగిసింది. ఇక సిండికేట్ మంగళం శ్రీను అండ్ గ్యాంగ్ తో పాటు కొత్తగా ఢిల్లీ మినిస్టర్ కూడా శత్రువు అవుతాడు. సీఎం సిద్ధప్ప కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తాడు. అందరు కలిసి పుష్ప రాజ్ ని టార్గెట్ చేస్తే ఒంటరిగా ఉన్న పుష్ప ఏం చేశాడు అన్నది కథ ఉంటుంది.

ఐతే పుష్ప 1 కన్నా పుష్ప 2 లో క్యారెక్టరైజేషన్ రేంజ్ మాస్ యాటిట్యూడ్ పెంచాడు సుకుమార్. ఇక పార్ట్ 2 కన్నా పార్ట్ 3 మరింత భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది. ఐతే పుష్ప 3 మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి. మరి సుకుమార్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి. ఐతే పుష్ప 1 తర్వాత పుష్ప 2 మొదలు పెట్టాడు కానీ పుష్ప 3 మాత్రం అలా కాకుండా అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2026 ఎండింగ్ లో లేదా 2027 లో అలా మొదలు పెట్టి 2030కి పుష్ప 3 రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట. మరి పుష్ప 3 2030 అంటే అల్లు అర్జున్ రెండు సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.