Begin typing your search above and press return to search.

కార్తి ఏం చేస్తున్నాడు..?

ఐతే ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ కన్నా ఓటీటీ రిలీజ్ అయ్యాక ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:18 AM GMT
కార్తి ఏం చేస్తున్నాడు..?
X

కోలీవుడ్ హీరో అయిన కార్తి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. స్ట్రైట్ తెలుగు హీరోలానే కార్తికి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే కార్తి తన ప్రతి సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసేలా చూస్తాడు. కార్తి లాస్ట్ ఇయర్ మేయలగన్ సినిమాతో వచ్చాడు. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఐతే ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ కన్నా ఓటీటీ రిలీజ్ అయ్యాక ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

ఇక ప్రస్తుతం వా వాథియార్ తో పాటు సర్దార్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు కార్తి. లాస్ట్ ఇయర్ అన్న సూర్య కంగువ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన కార్తి ఆ సినిమా నిరాశ పరచడంతో అతని పాత్ర గురించి ఎవరు చర్చ జరపలేదు. ఆడియన్స్ కు ఒక కొత్త సినిమా ఎక్స్ పీరియన్స్ అందించాలని కార్తి ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంటాడు. అందుకే అతని సినిమాలు మిగతా హీరోల సినిమాల కన్నా డిఫరెంట్ గా ఉంటాయి.

కార్తి లోకేష్ కాంబోలో వచ్చిన ఖైది సినిమా సూపర్ హిట్ కాగా ఆ సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కార్తి సర్దార్ 2 పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక కానీ ఖైదీ 2 సినిమా చేసే ఛాన్స్ లేదు. ఓ పక్క లోకేష్ కూడా కూలీ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. సో అటు కార్తి ఇటు లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ కలిసి ఖైదీ 2 ని అంచనాలకు మించి ఉండేలా చేయాలని చూస్తున్నారు.

కార్తి ఖైదీ 2 కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సర్దార్ ఎలాగు తెలుగులో కూడా సక్సెస్ అయ్యింది కాబట్టి సర్ధార్ 2 కి మన దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. దానికి తగినట్టుగానే రిలీజ్ ప్లాన్ చేస్తారు. కార్తి సినిమా ఎప్పుడు డిజప్పాయింట్ చేయదు అనేలా ఆడియన్స్ కు నమ్మకం కలిగించేలా అతను కష్టపడుతున్నాడు. మరి రాబోతున్న సినిమాలు కార్తిని ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాయన్నది చూడాలి. కార్తి మాత్రం తన కెరీర్ ప్లాన్ ప్రకారమే నచ్చిన కథలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. సక్సెస్ రేటులో కూడా కార్తి తన సత్తా చాటుతున్నాడు.