Begin typing your search above and press return to search.

ప్రభాస్.. అసలు వంగా ప్లాన్ ఏంటీ?

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:51 AM GMT
ప్రభాస్.. అసలు వంగా ప్లాన్ ఏంటీ?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు సందీప్ రెడ్డి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

డార్లింగ్ అభిమానులు స్పిరిట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ చేతిలో ఉన్న ఐదు సినిమాలలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గా ‘స్పిరిట్’ ఉండబోతోంది. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చేస్తున్నారు. మరో 40 నుంచి 50 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.

ప్రభాస్ లేని సన్నివేశాలు ప్రస్తుతం తెరకెక్కించే పనిలో హను రాఘవపూడి ఉన్నారు. 2025 ఆరంభంలో ‘ఫౌజీ’ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత 2025 సమ్మర్ నుంచి ‘స్పిరిట్’ మూవీ రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందంట. ప్రభాస్ కూడా ‘స్పిరిట్’ కోసం కంప్లీట్ కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ మూవీ ప్రొడక్షన్ సమయంలో మరి ఏ ఇతర సినిమాల షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని టాక్.

‘స్పిరిట్’ లో తన పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని కల్కి2898ఏడీ సినిమా షూటింగ్ కి డార్లింగ్ వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అతని పాత్ర చాలా భిన్నంగా ఉండబోతుందనే మాట వినిపిస్తోంది ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

యానిమల్ లాంటి మోస్ట్ వైలెంట్ కథాంశంతో సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ లో ఎలాంటి కథని చెబుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ని ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం సందీప్ రెడ్డి వంగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.