దర్శన్ గ్యాంగ్ కస్టడీ సంగతేంటంటే?
ప్రతిగా దర్శన్ తరుపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించగా కోర్టు తోసుపుచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. దర్శన్ అరెస్ట్ అయి నెలరోజులు దాటింది.
By: Tupaki Desk | 19 July 2024 12:13 PM GMTహత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ పరప్పన్ అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటితో రిమాండ్ కూడా ముగిసింది. మరి తాజా అప్ డేట్ ఏంటి? అంటే కస్టడీ ని ఆగస్ట 1వరకూ కోర్టు పొడిగించింది. బెయిల్ పై నిన్న విచారణ జరగగా నిరాశే ఎదురైంది. దీంతో మళ్లీ జ్యూడీషియల్ కస్టడీనికి పొగించారు. పోలీసులు స్టేషన్ కస్టడీ అడిగినప్పటికీ కోర్టు ఇవ్వనట్లు తెలుస్తోంది. నిందితులందర్నీ వీడియో కాన్పరెన్స్ ద్వారా జడ్జ్ ముందు విచారించారు.
ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ నిరాకరించి కస్టడీని పొడిగించింది. ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు,చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ పిటీషన్ వేసుకోగా జైలు నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖని కోరితే సరిపోతుందని కానీ దర్శన్ అలా చేయ కుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం భావ్యం కాదని ప్రభుత్వ తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు.
ప్రతిగా దర్శన్ తరుపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించగా కోర్టు తోసుపుచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. దర్శన్ అరెస్ట్ అయి నెలరోజులు దాటింది. బెయిల్ కోసం ఆయన భార్య విజయలక్ష్మి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా? రావడం లేదు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అమెకి కూడా నోటీసులిచ్చి విచారించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గత ఏడాది జనవరిలో దర్శన్ ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి అక్రమంగా ఉంచిన బార్ హెడ్డ్ గూస్ ( మంగోలియా జాతికి చెందిన లేత బూడిద రంగు పక్షులు) పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అలా ఉంచడం చట్టరీత్యా నేరం.
ఆ పక్షుల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖకు అప్పగించారు. దీంతో అటవీ శాఖ విజయలక్ష్మి, దర్శన్ తో పాటు మేనేజర్ నాగరాజు లపై అక్రమ పక్షుల పెంపకపై కేసు నమోదు చేసి విచారణకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింద. ఈ కేసులో విజయలక్ష్మి ఏ1, నాగరాజు ఏ2, దర్శన్ ఏ3గా ఉన్నారు.