Begin typing your search above and press return to search.

దేవర భారీ టార్గెట్.. ఎన్టీఆర్ స్టామినాకు పరీక్ష..!

ఇక ప్రచార చిత్రాలుగా వదిలిన టీజర్, దేవర ముంగిట నువ్వెంత సాంగ్ కూడా హైప్ తెచ్చాయి.

By:  Tupaki Desk   |   4 Jun 2024 4:29 AM GMT
దేవర భారీ టార్గెట్.. ఎన్టీఆర్ స్టామినాకు పరీక్ష..!
X

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా దసరా బరిలో అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. RRR తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై ఆకాశాన్ని అంటే అంచనాలు ఏర్పడ్డాయి. జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కథకు తగినట్టుగా దేవర టైటిల్ ఫిక్స్ చేసే సరికి అంచనాలు డబుల్ అయ్యాయి. ఇక ప్రచార చిత్రాలుగా వదిలిన టీజర్, దేవర ముంగిట నువ్వెంత సాంగ్ కూడా హైప్ తెచ్చాయి.

ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. అందుకే సినిమా ప్రతి విషయంలో ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర టార్గెట్ ఎంత అన్నది ప్రస్తుతం చర్చల్లో ఉంది. RRR తో 1000 కోట్ల మార్క్ రీచ్ అయిన తారక్ సోలోగా ఆ టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

దేవర సబ్జెక్ట్ తో పాటుగా సినిమా కూడా అనుకున్న దానికన్నా బెటర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం అనుకున్న టార్గెట్ పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. బాహుబలి రెండు భాగాలతో 2000 కోట్లు కొట్టిన ప్రభాస్ కూడా ఆ తర్వాత 600 కోట్లను మించి వసూళ్లను రాబట్టలేదు. అలాంటి ఎన్టీఆర్ దేవర తో సోలోగా 1000 కోట్లు కొడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

పాన్ ఇండియా లెవెల్ లో తారక్ ని ఇష్టపడే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. వారందరికీ దేవర చూడాలన్న ఆసక్తి కలిగిస్తే చాలు సినిమా ఎంత భారీ టార్గెట్ పెట్టుకున్నా రీచ్ అవుతుంది. దేవర ప్రమోషనల్ కంటెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న దేవర కోసం సెప్టెంబర్ మిడిల్ నుంచే భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 లో నటిస్తున్నాడు కాబట్టి దేవర కి అది కూడా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. మరి ఎన్.టి.ఆర్ దేవర ఫైనల్ టార్గెట్ రీచ్ అవుతుందా అనుకున్నట్టుగా 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తుందా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పగలం.