Begin typing your search above and press return to search.

పాపుల‌ర్ హీరోయిన్ ముఖానికి ఇంత‌కీ ఏమైంది

ఏంజెలీనా జోలీ ఇటీవల తన జీవితంలో స‌వాల్ గా మారిన‌ దశలో-నటుడు బ్రాడ్ పిట్ నుండి విడాకులు తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:30 PM GMT
పాపుల‌ర్ హీరోయిన్ ముఖానికి ఇంత‌కీ ఏమైంది
X

స‌ద‌రు హీరోయిన్ అందం, న‌ట‌ప్ర‌తిభ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ద‌శాబ్ధాల పాటు త‌న ఎరాలో ఎన్నో సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది. కెరీర్ కీల‌క ద‌శ‌లో యాక్ష‌న్ క్వీన్ గా సూప‌ర్ గాళ్ త‌ర‌హా పాత్ర‌ల‌తో మెప్పించింది. భారీ పారితోషికాలు అందుకుని బిజినెస్ ఉమెన్ గాను కోట్లాది రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీని ర‌న్ చేస్తోంది. కానీ స‌ద‌రు హీరోయిన్ వ్య‌క్తిగ‌త కుటుంబ జీవితం మాత్రం క‌ల్లోలంగా మారింది. ప్ర‌ముఖ స్టార్ హీరోని పెళ్లాడి అనంత‌రం విడాకుల ప్ర‌హ‌స‌నంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కోర్టు గొడ‌వ‌లు ముప్పిరిగొల‌ప‌నివ్వ‌క‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం స‌ద‌రు హీరోయిన్ ఆరోగ్యంపైనా ప‌డింది. అంతేకాదు.. స‌రిగ్గా విడాకుల‌కు ముందు పాక్షికంగా ముఖ ప‌క్ష‌పాతాన్ని ఎదుర్కొంది. అంటే ముఖం ఓ వైపుకు లాగేసింద‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో త‌నే స్వ‌యంగా వెల్ల‌డించింది.

ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరోయిన్ ఎవ‌రు? అంటే ఏంజెలినా జోలీ. బ్రాడ్ పిట్ మాజీ భార్య‌. అత‌డితో విడాకులకు 6 నెలల ముందు ఏంజెలీనా జోలీ పాక్షిక ముఖ పక్షవాతంతో బాధపడ్డాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ఏంజెలీనా జోలీ ఇటీవల తన జీవితంలో స‌వాల్ గా మారిన‌ దశలో-నటుడు బ్రాడ్ పిట్ నుండి విడాకులు తీసుకున్నారు. అయితే అదే స‌మ‌యంలో ఓ చిత్రంలో కల్లాస్ అనే పాత్రలో న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, కానీ శరీరాన్ని ప్రభావితం చేసే ఒత్తిడి సంకేతాలను పేర్కొంటూ పాత్ర గురించి అభ్యంతరాలను వ్యక్తమైంద‌ని తెలిపింది. ఏంజెలీనా జోలీ తన విడాకుల సమయంలో ఇలాంటి అరుదైన‌ శారీరక సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపింది.

నా శరీరం ఒత్తిడికి చాలా బలంగా స్పందిస్తుంది. నా బ్లడ్ షుగర్ పెరుగుతుంది.. తగ్గుతుంది.. అని తెలిపింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ జోలీ పై విష‌యాల‌ను వెల్లడించింది. ది జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం... బెల్ పక్షవాతం అనేది ముఖ కండరాల బలహీనత.. అది ఒక‌ వివరించలేని ఎపిసోడ్. ఈ పరిస్థితి ముఖ నరాలు దెబ్బతినడం వల్ల వస్తుంది.

ఏంజెలీనా జోలీ - బ్రాడ్ పిట్ 2016లో చట్టబద్ధంగా విడిపోయారు. బ్రాడ్ - ఏంజెలీనా విడాకుల తర్వాత ఈ స్టార్ క‌పుల్ సుదీర్ఘమైన చట్టపరమైన వివాదంలో ఉన్నారు. ముఖ్యంగా వారి ఆరుగురు పిల్లల సంరక్షణకు సంబంధించి కోర్టులో విచార‌ణ సాగుతోంది. మాడాక్స్ (22), పాక్స్ (20), జహారా (18), షిలో (17), కవలలు నాక్స్ లియోన్ - వివియన్నే మార్చెలిన్ (15) గురించిన కోర్టులో వాగ్వాదాలు ఇటీవ‌ల సంచ‌ల‌న‌ టాపిక్ గా మారాయి. ఇత‌ర విష‌యాల కంటే తనకు తన పిల్లలకు స్వస్థత చేకూర్చవలసిన అవసరాన్ని జోలీ తాజా ఇంట‌ర్వ్యూలో నొక్కిచెప్పారు.

2016 నుండి జోలీ తన పిల్లలు, సినిమా ప్రాజెక్ట్‌లతో పాటు దాతృత్వానికి తనను తాను అంకితం చేసుకున్నట్లు తెలిపింది. జోలీ ఇటీవల తన ఫ్యాషన్ బ్రాండ్ అటెలియర్ జోలీని ప్రారంభించింది. తాను డేటింగ్ చేయలేదని, లాస్ ఏంజిల్స్‌లో చాలా పరిమిత సామాజిక జీవితాన్ని కలిగి ఉన్నానని కూడా ఆమె వెల్లడించింది. తన పిల్లలతో మాత్రమే సమయం గడుపుతాన‌ని ఓ పత్రికకు తెలిపింది. ``వారు నాకు .. నా జీవితానికి అత్యంత సన్నిహిత వ్యక్తులు.. మేము ఏడుగురు (పిల్ల‌లు క‌లుపుకుని) వేర్వేరు వ్యక్తులం.. అదే మా బలం`` అన్నారు.

జోలీ తన కుటుంబంతో పాటు తన స్నేహితులు శరణార్థులుగా మారార‌ని, భారీ సంఖ్యలో త‌న వాళ్లు యుద్ధం తాలూకా సంఘర్షణలను అనుభవించారని వెల్లడించింది. నేను సన్నిహితంగా ఉన్న స్త్రీలలో ఆరుగురిలో నలుగురు యుద్ధంలో సంఘర్షణలకు గురైన వారు కావచ్చు! అని చెప్పింది.

హాలీవుడ్ ఆరోగ్య‌క‌రమైన‌ది కాదు:

హాలీవుడ్‌లో తన జీవితాన్ని ప్రతిబింబించే వ్యాఖ్య‌లు చేసారు జోలీ. పరిశ్రమ నిస్సార స్థితి నుండి బయటపడాలని జోలీ ఆకాంక్షించారు. తన విడాకుల ప్రభావాన్ని హైలైట్ చేస్తూ తాను స్వేచ్ఛగా జీవించడానికి ప్రయాణించే సామర్థ్యాన్ని పరిమితం చేసింది అని అన్నారు. హాలీవుడ్‌ను అనారోగ్యకరమైన వాతావరణంగా అభివర్ణించారు జోలీ. పాపుల‌ర్ WSJ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ- ప‌రిశ్ర‌మ‌లో ప్రామాణికత కోసం తాను ఆరాటపడుతున్నానని జోలీ చెప్పింది. నేను చాలా లోతులేని ప్రదేశంలో పెరిగాను. ప్రపంచంలోని అన్ని ప్రదేశాలను చూసాను. హాలీవుడ్ ఆరోగ్యకరమైన ప్రదేశం కాదు. కాబట్టి ప్రామాణికతను కోరుకోవ‌డం స‌హ‌జం`` అని జోలీ చెప్పారు.