Begin typing your search above and press return to search.

అండ‌ర్‌వేర్‌ ట్రాక్ సూట్ అంటే ఇదేనా?

వ‌య‌సు 33 .. కానీ స్పీడ్ మాత్రం ఇంకా ప‌ద‌హారే (16) అని అంగీక‌రించాల్సిందే.

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:21 PM GMT
అండ‌ర్‌వేర్‌ ట్రాక్ సూట్ అంటే ఇదేనా?
X

అవును .. ఈ డ్రెస్ ని ఏమ‌ని పిల‌వాలి. అండ‌ర్ వేర్ ట్రాక్ సూట్ అని పిలిస్తే త‌ప్పేమీ కాదు క‌దా? నిజానికి ఇలా అండ‌ర్‌వేర్‌పై ట్రాక్ ఫ్యాంట్ తొడుక్కుని, టాప్ లో బ్లేజ‌ర్ సూట్ ధ‌రిస్తే.. ఇది పార్టీ క్రౌడ్ ని, ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించకుండా ఉంటుందా? ఒక‌వేళ రొటీనిటీతో విసిగిపోతే అలాంటి ప్ర‌జ‌ల కోస‌మే ఇలాంటి స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసింది టీవీ మూవీ న‌టి నియా శ‌ర్మ‌. వ‌య‌సు 33 .. కానీ స్పీడ్ మాత్రం ఇంకా ప‌ద‌హారే (16) అని అంగీక‌రించాల్సిందే.


టీవీ మూవీ న‌టి నియా శ‌ర్మ నిరంత‌ర ఫోటోషూట్ మాయాజాలం ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా స్పెష‌ల్ ట్రీట్ గా మారుతోంది. ఈ బోల్డ్ బ్యూటీ ప్ర‌తిసారీ యూనిక్ నెస్ కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. వేదిక ఏదైనా కానీ అక్క‌డ షో స్టాప‌ర్ గా నిల‌వ‌డం ఎలానో ఈ భామ‌కు తెలుసు. ఇదిగో ఇక్క‌డ పార్టీ నైట్ లో నియా శ‌ర్మ చెల‌రేగిపోయింది. పార్టీలో జ‌నం క‌ళ్ల‌న్నీ త‌న స్పెష‌ల్ డ్రెస్ పై నుంచి వైదొలిగిందే లేదు. అంత‌గా ఈ భామ డ్రెస్సింగ్ సెన్స్ మ‌తులు చెడ‌గొట్టింది.


ఎవ‌రో సాంప్ర‌దాయ వాదుల‌కు ఇలాంటివి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ఇలాంటి ప్రత్యేక‌త క‌లిగిన బోల్డ్ అందాల‌ను ఆద‌రించే అభిమానుల‌కు కొద‌వేమీ లేదు. యూత్ లో నియాశ‌ర్మ‌కు ఉన్న ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెర‌గ‌డానికి కార‌ణం ఈ యూనిక్ నెస్ అని అంగీక‌రించాలి.


టీవీ న‌టి నియా శర్మ ఇటీవ‌లే దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫాలో హాటెస్ట్ ఫోటోషూట్ తో మ‌తులు చెడ‌గొట్టింది. తాను బుర్జ్‌ఖలీఫా.... 154వ అంతస్తులో ఉన్నాన‌ని కూడా తెలిపింది. నియా దుబాయ్ వీధుల్లో చెప్పులు లేకుండా నడుస్తున్న ఫోటోల బంచ్ ను కూడా షేర్ చేసింది. అవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇంత‌లోనే ఇప్పుడు ఇలా నియా శ‌ర్మ లేట్ నైట్ పార్టీలో స్పెష‌ల్ డ్రెస్ తో మెరిసింది.

నియా శర్మ 2010లో `కాళి ఏక్ అగ్నిపరీక్ష`తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై వంటి షోలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈ కార్యక్రమంలో క్రిస్టిల్ డిసౌజా, కరణ్ థాకర్, కుశాల్ టాండన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రవి దూబే సరసన నటించిన జమై రాజా షోకి కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. నియా ఖత్రోన్ కే ఖిలాడీ -ఝలక్ దిఖ‌లాజా వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది.

గత నెలలో నియా పరిశ్రమలో తన 13 సంవత్సరాల వేడుక‌ను జరుపుకుంది. ఈ సంద‌ర్భంగా సోషల్ మీడియాలో ఎమోష‌న‌ల్ లెట‌ర్ ని షేర్ చేసింది. ``టెలివిజన్ ప్రపంచంలో 13 అద్భుతమైన సంవత్సరాలు. అయ్యో! ఈ కేకులు పువ్వులు ప్రతి చిన్న పెద్ద సందర్భంలో.....! ఇవేవీ ఎప్పుడూ గుర్తుంచుకోలేదు లేదా లెక్కించలేదు... అని తెలిపింది.