Begin typing your search above and press return to search.

న‌య‌న‌తార లో ఈ స‌డెన్ ఛేంజ్ ఏంట‌బ్బా?

లేదంటే ఎన్ని కోట్లు పారితోషికం ఇస్తానన్నా ఆసినిమా ని వ‌దులుకుంటుంది త‌ప్ప‌! సైన్ చేయ‌డం అన్న‌ది అసాధ్యం.

By:  Tupaki Desk   |   3 Feb 2024 12:30 AM GMT
న‌య‌న‌తార లో ఈ స‌డెన్ ఛేంజ్ ఏంట‌బ్బా?
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌దు అన్న సంగ‌తి తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా..ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనదు. ఓ సినిమాకి సైన్ చేసే ముందు టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ లో ఈ పాయింట్ క‌చ్చితంగా ఉంటుంది. అందుకు ఒకే అయి తేనే నిర్మాత‌ల‌తో అగ్రిమెంట్ చేసుకుంటుంది. లేదంటే ఎన్ని కోట్లు పారితోషికం ఇస్తానన్నా ఆసినిమా ని వ‌దులుకుంటుంది త‌ప్ప‌! సైన్ చేయ‌డం అన్న‌ది అసాధ్యం.

అయితే న‌య‌న‌తార భ‌ర్త విగ్నేష్ శివ‌న్ తో క‌లిసి వ్యాపార రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అది సొంత వ్యాపారం కావ‌డంతో త‌మ ఉత్ప‌త్తుల కోసం తానే స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌చారం మొద‌లు పెట్టింది. ఈ ర‌క‌మైన ప్ర‌చారంలోకి ఈ మ‌ధ్య‌నే దిగింది. ఈ విష‌యంలో న‌య‌న్ పై కొంత వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మైం ది. సొంత వ్యాపారం కాబ‌ట్టి త‌న‌కు తానుగా ప్ర‌చారం చేసుకుంటుంది. అదే ఓ సినిమాకి పారితోషికం తీసుకుంటుంది గానీ ఆ సినిమా ప్ర‌చారానికి మాత్రం రాదు .ఇదేం న్యాయం అంటూ కోలీవుడ్ లో కాస్త అస‌హ‌నం కూడా వ్య‌క్త‌మైంది. అయినా వాటిని న‌య‌న‌తార ప‌ట్టిం చుకోలేద‌నుకోండి.

అయితే తాజాగా న‌య‌న‌తార లో ఈ మార్పు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎందుకం టే ఓ సినిమా గురించి తొలిసారి సోష‌ల్ మీడియాలో స్పందించ‌డం కావ‌డంతోనే అంతా ఆశ్చ‌ర్య‌పో తున్నారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార టెస్ట్ అనే సినిమాలో న‌టిస్తోంది. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని శ‌శికాంత్ తెర‌క్కిస్తు న్నాడు. వైనాట్ స్టూడియోస్ ప‌తాకంపై చ‌క్ర‌వ‌ర్తి రామ‌చంద్ర‌..శ‌శికాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేద‌కిగా న‌య‌న‌తార ఓ వీడియోని షేర్ చేసింది.

'జీవితాన్ని ఆడించే టెస్ట్ ఆట ముగిసింది. ఈ వేస‌వికి థియేట‌ర్లో క‌లుద్దాం' అంటూ వ్యాఖ్య‌ల్ని జోడిం చింది. ఇంత‌వ‌ర‌కూ ఓ సినిమా గురించి ఆమె స్టార్ అయిన త‌ర్వాత‌..ప్ర‌చారానికి పుల్ స్టాప్ పెట్టేసిన త‌ర్వాత ఏ సినిమా విష‌యంలో ఇలా స్పందించ‌లేదు. తొలిసారి ఓ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇవ్వ‌డం... రిలీజ్ ఎప్పుడు అవుతుందో ఆమె నోటితో చెప్ప‌డం ఇదే. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా పెద్ద సినిమాల్లో న‌టిం చింది గానీ ఏ సినిమాకి ఇలాంటి వ్యాఖ్య‌లు జోడించ‌లేదు. దీంతో న‌య‌న‌తార ఈ కొత్త మార్పు ఏంటి? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ ప్ర‌చారం ఈ సినిమాకేనా? ఇక‌పై అన్ని సినిమాల‌కు ఉంటుందా? అంటూ న‌య‌న‌తార‌ని అడుగుతున్నారు.