తారక్ మాటలకు అర్దం ఏమిటి?
తాజాగా 'దేవర' చిత్రం నిర్మాణంలోనూ ఆయన భాగమయ్యారు. ఇలా మూడేళ్ల కాలంలో హరి పేరు బాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 5 Oct 2024 10:33 AM GMT'ఎవరేమన్నా? ఎవరేమనుకున్నా? ఎన్టీఆర్ ఆర్స్ట్ అనే బ్యానర్ కి మూల స్థబం హరి. నాకు కల్యాణ్ అన్నకు, మా ఇద్దరి స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు. నచ్చిన వాళ్లు దీన్ని జీర్ణించుకోవచ్చు. నచ్చని వాళ్లు దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు' అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సక్సెస్ మీట్ లో భాగంగా ఖరాకండీగా మాట్లాడిన మాటలివి. తారక్ ఇంత వరకూ ఏ సినిమా వేదికపైనా ఇలా మాట్లాడింది లేదు.
వివాదాస్పద అంశాల జోలికెప్పుడు సినిమా వాళ్లు వెళ్లరు. తారక్ కూడా వెళ్లరు. కానీ 'దేవర' ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలే చర్చనీయంశంగా మారాయి. తారక్ ఎందుకలా మాట్లాడారు? ఎన్నడు లేనిదే నిన్నటి రోజునే అలాంటి సన్నివేశం ఎదురవ్వడం ఏంటి? అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. స్వర్గీయ ఎన్జీ రామారావు పేరిట ఎన్టీఆర్ ఆర్స్ట్ ని నందమూరి కళ్యాణ్ రామ్ 2005లో స్థాపించారు.
అందులో తొలి సినిమా 'అతనొక్కడే'. ఆ సంస్థలో ఆ సినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ మూడేళ్ల తర్వాత అదే హీరోతో అదే సంస్థలో 'హరేరామ్' అనే చిత్రం నిర్మాణమైంది. ఆ తర్వాత ఏకధాటిగా 'జయిభవ', 'కల్యాణ్ రామ్ కత్తి' ,' ఓమ్ త్రీడీ', 'పటాస్' లాంటి చిత్రాలు నిర్మించారు. అలా దాదాపు పదేళ్ల పాటు కళ్యాణ్ రామ్ బ్యానర్ లో తన సొంత సినిమాలే నిర్మించారు. ఆ తర్వాత 2015 లో 'కిక్ 2' చిత్రాన్ని రవితేజ నిర్మించారు.
అటుపై ' ఇజం', 'జై లవకుశ', 'బిబిసార', 'దేవర' ఇలా అన్ని సొంత సినిమాలే కళ్యాణ్ నిర్మించారు. ఆ సంస్థలో నటించిన బయట హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క రవితేజ మాత్రమే. అయితే తాజాగా యంగ్ టైగర్ తమ బలంగా హరి అనే వ్యక్తి గురించి చెప్పడంతో? ఆ సంస్థతో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే 'బింబిసార' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్ పై తొలిసారి నిర్మాత గా కొసరాజు హరికృష్ణ అలియాస్ హరి పేరు పడింది.
తాజాగా 'దేవర' చిత్రం నిర్మాణంలోనూ ఆయన భాగమయ్యారు. ఇలా మూడేళ్ల కాలంలో హరి పేరు బాగా తెరపైకి వచ్చింది. అయితే ఆయన ఎప్పుడూ మీడియా ముందుకొచ్చి మాట్లాడింది లేదు. ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తాజాగా అతడి కోసం తారక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.