Begin typing your search above and press return to search.

జెర్సీ వెంకటేష్ చేయాల్సిందా.. సైంధవ్ తో హాయ్ నాన్నకి లింక్ ఏంటి..

డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సైంధవ్ హీరో వెంకటేష్ తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 12:31 PM GMT
జెర్సీ వెంకటేష్ చేయాల్సిందా.. సైంధవ్ తో హాయ్ నాన్నకి లింక్ ఏంటి..
X

న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందించారు. డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సైంధవ్ హీరో వెంకటేష్ తో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. హాయ్ నాన్న సంగతులతో నాని, సైంధవ్ విశేషాలతో వెంకటేష్ ఇద్దరు ఒకరి సినిమా గురించి మరొకరు ప్రమోట్ చేశారు.

హాయ్ నాన్న ట్రైలర్ చూడగానే మనసుకి నచ్చిందని.. సినిమాలో ప్రతి డైలాగ్ లో డెప్త్ కనిపిస్తుంది. హాయ్ నాన్న అనేది ప్రతి నిత్యం మనం వినే మాటే అందుకే సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంటుందని అన్నారు వెంకటేష్. నాని చేస్తున్న డిఫరెంట్ జోనర్స్ గురించి ప్రస్తావించారు వెంకటేష్.

దసరా, హాయ్ నాన్న ఇలా వెరైటీ కథలను చేస్తున్నారని అన్నారు. తను కూడా దృశ్యం, F2, నారప్ప, F3, రానా నాయుడు ఇలా అన్ని వెరైటీ కథలను చేస్తున్నానని అన్నారు వెంకటేష్. మీ సినిమాలు చూసి స్పూర్తిగా పొంది ఎమోషన సినిమాలు చేస్తున్నానని వెంకటేష్ ని ఉద్దేశించి అన్నారు నాని. అయితే నాని నటించిన జెర్సీ సినిమా కథ ముందు వెంకటేష్ దగ్గరకు వచ్చిందట.. ఆ టైం లో తాను బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదని అన్నారు వెంకటేష్.

హాయ్ నాన్న, సైంధవ్ రెండిటిలో డాటర్ సెంటిమెంట్ ఉంటుందని. న్యూ ఏజ్ యాక్షన్ సినిమాగా సైంధవ్ వస్తుంది. కచ్చితంగా ఆడియన్స్ కు ఈ సినిమా మంచి అనుభూతిని అందిస్తుందని అన్నారు వెంకటేష్. హాయ్ నాన్న కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని అన్నారు నాని. డిసెంబర్ 7న నాని హాయ్ నాన్న వస్తుండగా జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని అంశాలున్న సినిమాగా సైంధవ్ పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని అన్నారు వెంకటేష్.