Begin typing your search above and press return to search.

విశ్వంభర, కల్కి, పుష్ప ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..!

అయితే ముగ్గురు స్టార్స్‌ హీరోలు మాత్రం షూటింగ్‌ లో భాగంగా డాన్స్‌ లు చేస్తూ ఉల్లాసంగా ఉన్నారట.

By:  Tupaki Desk   |   7 March 2024 8:06 AM GMT
విశ్వంభర, కల్కి, పుష్ప ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..!
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు దాదాపు అంతా కూడా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణలతో పాటు యంగ్‌ హీరోలు ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చరణ్‌, అల్లు అర్జున్‌ ఇలా అంతా కూడా వారి వారి షూటింగ్స్ లో హడావుడిగా ఉన్నారు. అయితే ముగ్గురు స్టార్స్‌ హీరోలు మాత్రం షూటింగ్‌ లో భాగంగా డాన్స్‌ లు చేస్తూ ఉల్లాసంగా ఉన్నారట.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే కొంత టాకీ పార్ట్‌ పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి మరియు త్రిష పై పాట ను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక ప్రభాస్‌ కల్కి సినిమా పాట కోసం ఇటలీ వెళ్లాడు. సెకండ్‌ హీరోయిన్ దిశా పటానీ తో రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటలీ బీచ్ లో అందమైన లొకేషన్స్ నడుమ చిత్రీకరణ జరుగుతున్నట్లుగా ఇటీవల చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలు కూడా పంచుకున్నారు.

ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్‌ కూడా డాన్స్ చేస్తున్నాడట. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ పుష్ప 2 లోని ప్రతి ఎలిమెంట్‌ ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం పుష్ప, శ్రీవల్లిపై హైదరాబాద్‌ శివారులోని ఒక స్టూడియోలో పాట చిత్రీకరిస్తున్నాడు.

మొత్తానికి విశ్వంభర, కల్కి మరియు పుష్ప లు పాటలకు డాన్స్ లు చేస్తూ జోష్ గా ఉన్నారు. ఈ మూడు సినిమాల్లో మొదట కల్కి సినిమా రాబోతుంది. ఆ తర్వాత పుష్ప 2 సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విశ్వంభర ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.