Begin typing your search above and press return to search.

సమంత, నాని... సడెన్‌ సర్‌ప్రైజ్‌

ఇద్దరు కూడా విమానాశ్రయ బస్సులో ప్రయాణించడంతో పాటు, కొన్ని నిమిషాల పాటు రన్‌ వే కూడా నడుస్తూ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 12:48 PM GMT
సమంత, నాని... సడెన్‌ సర్‌ప్రైజ్‌
X

సినిమా స్టార్స్ ఫోటోలు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. అయితే సినిమా స్టిల్స్ కాకుండా ఆఫ్ స్క్రీన్‌ లో ఏ ఇద్దరు స్టార్స్ కలిసినా కూడా ఆ ఫోటోలు వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో ఇప్పుడు నాని, సమంతల ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరు అనుకోకుండా ఎయిర్‌ పోర్ట్‌ లో కలిశారు. ఇద్దరు కూడా విమానాశ్రయ బస్సులో ప్రయాణించడంతో పాటు, కొన్ని నిమిషాల పాటు రన్‌ వే కూడా నడుస్తూ మాట్లాడారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వీరు సందడి చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... నాని తాజాగా నటించిన సరిపోదా శనివారం సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో నాని బిజీ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సరిపోదా శనివారం సినిమాను ఉత్తర భారతంలో ప్రమోట్‌ చేసేందుకు గాను నాని ఇటీవల ముంబై వెళ్లాడు. ఆ సందర్భంగా ఎయిర్‌ పోర్ట్‌ లో సమంత కనిపించింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు ఎదురు పడ్డారు. సడెన్ గా ఇద్దరు ఎదురు పడటంతో సర్‌ప్రైజ్ అయ్యారు. సినిమాల గురించి అడిగి తెలుసుకున్నారట.

సరిపోదా శనివారం సినిమా గురించి నాని ని సమంత అడిగి తెలుసుకుందట. అంతే కాకుండా ట్రైలర్‌ కూడా తప్పకుండా చూస్తాను అందట. నాని, సమంత గతంలో ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాతో పాటు ఈగ లో నటించారు. రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా వీరిద్దరిది హిట్‌ పెయిర్ గా పేరు దక్కింది. సమంత ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్‌ లతో బిజీ బిజీగా ఉంటుంది. అందుకే ఆమె ఎక్కువగా ముంబైలో ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే ముంబైలో సొంతంగా అపార్ట్‌మెంట్‌ ని కూడా కొనుగోలు చేసిందనే వార్తలు వచ్చాయి.

నాని సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌ గా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటించింది. ఇంతకు ముందే నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో అంటే సుందరానికి సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరిచినా కూడా నాని ఫ్యాన్స్ కి నచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌ గా ఆడక పోవడంకు కారణం తానే అని ఒప్పుకున్న నాని, ఈసారి ఆ తప్పులు జరగకుండా సినిమా తీశాము అంటూ చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా కమర్షియల్‌ గా బిగ్‌ సక్సెస్ అవుతుందనే నమ్మకం ను నాని వ్యక్తం చేశాడు.